యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ఆపరేషన్ గోల్డ్ ఫిష్. సాయి కిరణ్ అడివి ఈ చిత్రానికి దర్శకుడు. కొన్ని నెలల క్రితమే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న  ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం అంతర్జాతీయంగా సంచలనం రేపింది. 

ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ పూర్తి స్థాయిలో ఇండియాలో అంతర్భాగం అయింది. ఈ నిర్ణయం వల్ల దర్శకుడు సాయి కిరణ్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కథలో చాలా మార్పులు చేస్తున్నారట. ఈ చిత్రంలో ఆది ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు. రావు రమేష్ పాత్ర గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దులో అమిత్ షా పాత్ర కూడా కీలకం. 

ఈ చిత్రంలో రావు రమేష్ పాత్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా ని పోలి ఉంటుందని సమాచారం. అమిత్ షా రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి ఎలా ఎదిగారనే అంశాల ఆధారంగా సాయి కిరణ్ రావు రమేష్ పాత్రని డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

రావు రమేష్ పాత్ర కథలో చాలా కీలకంగా ఉంటుందట. ఆర్టికల్ 370 ప్రస్తావన కూడా ఈ చిత్రంలో ఉంటుందని సమాచారం. ఎయిర్ టెల్ యాడ్ భామ సాషా ఛెత్రి ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్ర విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు.