సంగీత దర్శకుడిగా గుర్తింపు సొంతం చేసుకున్న మున్నా కాశీ.. హేజా చిత్రంలో హీరోగా మారాడు. మిస్టర్ 7, చిత్రం చెప్పిన కథ, మామ ఓ చందమామ చిత్రాలకు మున్నా కాశీ సంగీతం అందించారు. ఈ చిత్రానికి దర్శకుడు కూడా ఆయనే. వి ఎన్ వి క్రియేషన్స్ పతాకంపై  కెవిఎస్ఎన్ మూర్తి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఐటెం సాంగ్స్ బ్యూటీ ముమైత్ ఖాన్,  బిగ్ బాస్ ఫేమ్ నూతన నాయుడుఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. హారర్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ విడుదలై  మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగాజరుగుతున్నాయి. 

మున్నా కాశి మాట్లాడుతూ...  ఇప్పటి వరకు చాల సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాను.. ఫస్ట్ టైమ్‌ హీరోగా, దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా ఇది..  ఒక మ్యూజికల్ హారర్ గా అధ్బుతమైన కథాంశంతో తెరెక్కుతున్న చిత్రం. ఈ చిత్రంలో నూతన్ నాయుడు, ముమైత్ ఖాన్ పాత్రలు సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటాయని మున్నా కాశీ తెలిపారు. త్వరలో ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.