మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్న మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' షూటింగ్ లో జాయిన్ అయ్యారు. మలయాళీ బ్లాక్ బస్టర్ లూసిఫెర్ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్న మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' షూటింగ్ లో జాయిన్ అయ్యారు. మలయాళీ బ్లాక్ బస్టర్ లూసిఫెర్ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నయనతార ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. గాడ్ ఫాదర్ మూవీ లో కథ పరంగా చిరంజీవి పాలిటిక్స్ లో కింగ్ మేకర్ గా కనిపిస్తారు. చిరంజీవి పార్టీ పేరు 'జన జాగృతి పార్టీ' అని తెలుస్తోంది. క్లిష్ట సమయాల్లో చిరంజీవి రాష్ట్ర రాజకీయాలని సెట్ చేసేందుకు కింగ్ మేకర్ గా మారుతారు. మలయాళంలో మోహన్ లాల్ అద్భుతంగా నటించారు. అదే పాత్రలో మెగాస్టార్ ఎలా ఉంటారో అనే ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉండగా ఈ చిత్రంలో వినిపిస్తున్న 'జన జాగృతి పార్టీ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సినిమాల్లో రియల్ లైఫ్ లో ఉన్న పొలిటికల్ పార్టీల పేర్లు ఉపయోగించకూడదు. కాబట్టి వేరే పేర్లు వాడాల్సి ఉంటుంది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ తన చిత్రాల్లో ప్రజారాజ్యం పార్టీ పేరు ఉపయోగించారు. అప్పటికి ఇంకా ప్రజారాజ్యం పార్టీ రాలేదు. ఆ తర్వాత చిరంజీవి ఆ పార్టీని స్థాపించారు.
ఇప్పుడు చిరు తన గాడ్ ఫాదర్ లో సౌండింగ్ బాగా ఉందని 'జన జాగృతి పార్టీ' పేరు ఉపయోగిస్తున్నారు. ఈ పేరు తన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు దగ్గరగా ఉంది. గాడ్ ఫాదర్ లో జన జాగృతి పార్టీ సిద్ధాంతాలు కూడా జనసేనని పోలి ఉంటాయని ప్రచారం జరుగుతోంది. పవన్ అభిమానులకు ఇంతకు ఇంచి కిక్కిచ్చే న్యూస్ ఏముంటుంది.
గాడ్ ఫాదర్ తర్వాత చిరు మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళా శంకర్ మూవీలో నటించనున్నారు. ఈ చిత్రంలో చిరు చెల్లి పాత్రలో కీర్తి సురేష్, హీరోయిన్ గా తమన్నా నటిస్తున్నారు.
