ప్రస్తుతం అల్లు శిరీష్ ఆశలు మొత్తం 'ఊర్వశివో రాక్షసీవో' చిత్రంపై ఉన్నాయి. చాలా కాలంగా ఈ చిత్రం వాయిదా పడుతూ రిలీజ్ కి నోచుకోవడం లేదు. ఎట్టకేలకు ఈ చిత్రం నవంబర్ 4న రిలిజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రమోషన్స్ జోరందుకున్నాయి.

మెగా హీరో అనే ట్యాగ్ తోనే శిరీష్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు దాదాపుగా అందరూ విజయాల బాటలో పయనిస్తున్నారు. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అల్లు శిరీష్ కష్టపడుతున్నప్పటికీ తనదైన మార్క్ ప్రదర్శించలేకున్నాడు. ప్రస్తుతం అల్లు శిరీష్ ఆశలు మొత్తం 'ఊర్వశివో రాక్షసీవో' చిత్రంపై ఉన్నాయి. 

చాలా కాలంగా ఈ చిత్రం వాయిదా పడుతూ రిలీజ్ కి నోచుకోవడం లేదు. ఎట్టకేలకు ఈ చిత్రం నవంబర్ 4న రిలిజ్ కి రెడీ అవుతోంది. దీనితో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ చిత్రంలో శిరీష్ కి జోడిగా హాట్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్ నటించింది. 

ఇటీవల ఈ చిత్ర మీడియా సమావేశం జరిగింది. అక్టోబర్ 30నప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యమైన అతిథి రాబోతున్నట్లు అల్లు అరవింద్ ప్రకటించారు. ఆయన అప్పియరెన్స్ స్పెషల్ గా ఉండబోతున్నట్లు అల్లు అరవింద్ తెలిపారు. ఆయన ఎవరో చెప్పనా అని అల్లు అరవింద్ అడగగా.. అల్లు శిరీష్ ఇప్పుడే వద్దు అని అన్నారు. 

అల్లు అరవింద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ గురించి అంతలా నొక్కి చెప్పారంటే ఎవరై ఉంటారు అంటూ ఫ్యాన్స్ ఊహల్లో మునిగిపోయారు. అయితే ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఇద్దరి బిగ్ స్టార్స్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకరు నందమూరి బాలకృష్ణ కాగా మరొకరు పవన్ కళ్యాణ్. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఊర్వశివో రాక్షసివో ప్రీ రిలీజ్ కి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రానికి మంచి ప్రమోషన్ లభించాలంటే పవన్ కళ్యాణ్ ని పిలవాలని అల్లు అరవింద్ ఆలోచన అట. అలాగే అన్ స్టాపబుల్ షోతో బాలయ్యతో అల్లు ఫ్యామిలీకి మంచి రిలేషన్ ఏర్పడింది. వీరిద్దరిలో ఎవరు హాజరవుతారనేది ప్రస్తుతం సస్పెన్స్.