కంగనాకి మరో షాక్‌ తగిలింది. మొన్న ట్విట్టర్‌ బిగ్‌ షాక్‌ ఇస్తే, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ షాక్‌ ఇచ్చింది. తాను పెట్టిన పోస్ట్ ని డిలీట్‌ చేసింది. తనకు కరోనా వచ్చిందని కంగనా రనౌత్‌ మూడు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. `గత కొన్ని రోజులుగా నిరసం, బలహీనంగా అనిపిస్తుందని, హిమాచల్‌ ప్రదేశ్‌కి వెళ్తామని టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఇది స్మాల్‌ టైమ్‌ ఫ్లూ` అని కంగనా బలంగా చెప్పింది.  కరోనాని చిన్నపాటి ఫ్లూగా చెప్పింది. అంతేకాదు కోవిడ్‌ని త్వరలోనే పడగొడతానని చెప్పింది. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌ నిర్వహకులకు ఇక్కడే మండింది. 

కరోనా దేశాన్ని, ప్రపంచాన్ని వణికిస్తుంటే, దాన్ని ఫ్లూగా వర్ణించడమేంటి, పైగా తక్కువ చేసిన చూపించడమేంటి?, రోజుకి కరోనాతో నాలుగు వేల మంది భారత్‌లో చనిపోతున్నారు. అలాంటి కంగనా దాన్ని అంత లైట్‌గా తీసుకోవడమేంటని చెబుతూ కంగనా పెట్టిన పోస్ట్ ని డిలీట్‌ చేసింది. ప్రజలను తప్పుదొవ పట్టించేలా ఈ పోస్ట్ ఉందని తొలగించినట్టు తెలిపారు.

దీనిపై కంగనా మండిపడింది. `ఇన్‌స్టాగ్రామ్‌ నా పోస్ట్ ని డిలీట్‌ చేసింది. దీనికి వాళ్లు హర్ట్ అయ్యారట. టెర్రరిస్ట్, కమ్యూనిస్ట్ ట్విట్టర్లోనే ఉన్నారనుకున్నా, ఇన్‌స్టాలో కూడా ఉన్నారని ఇప్పుడు అర్థమైంది. వీరంతా కోవిడ్‌ ఫ్యాన్స్ క్లబ్‌ గా ఉన్నారంటూ వర్ణించింది. బహుశా ఈ అకౌంట్‌ కూడా మరో వారంలో పోయినా పోవచ్చని తెలిపింది కంగనా. ఇలా వరుసగా కంగనా రనౌత్‌ వివాదాల్లో ఇరుకు కాంట్రవర్షీలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇటీవల బెంగాల్‌ హింసపై ఆమె చేసిన కామెంట్లు వివాదాస్పదంగా ఉన్నాయని, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, కంగనా ట్విట్టర్‌ అకౌంట్‌ని తొలగించారు.

కంగనా ప్రస్తుతం `తలైవి` చిత్రంలో నటిస్తుంది. జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. కరోనా వల్ల వాయిదా పడింది. దీంతోపాటు హిందీలో `దాఖడ్‌`, `తేజాస` చిత్రాల్లో నటిస్తుంది కంగనా. ఇటీవల `మణికర్ణిక` పేరుతో ఓ ప్రొడక్షన్‌ని కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే.