Asianet News TeluguAsianet News Telugu

#Animal: హీరో లీక్ చేసిన షాకింగ్ మేటర్..ఇదే జరిగితే ఎలా ఉండేదో

. కానీ, సందీప్‌ వంగా తన కథపై నమ్మకంతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఆయన తీసిన ‘అర్జున్‌ రెడ్డి’ కూడా మూడు గంటల సినిమాయే. 

Initially Sandeep Vanga presented  Animal a 3 hours 49 minutes cut jsp
Author
First Published Nov 28, 2023, 7:34 AM IST


బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor),స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika) కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో విభిన్న కథతో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ‘యానిమల్‌’కు సంబంధించిన రన్‌టైమ్‌ను దర్శకుడు సందీప్‌ వంగా షేర్ చేయగానే్ అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా రన్ టైమ్ లెంగ్త్  చూసి, నెటిజన్లే కాదు, సినీ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ‘‘యానిమల్‌’ నిడివి 3 గంటలా 21 నిమిషాలా 23 సెకన్లు & 16 ఫ్రేమ్స్‌’’ అంటూ సందీప్‌ తెలిపారు. అయితే ఇక్కడే మరో షాకింగ్ విషయం రివీల్ అయ్యింది. 

మొదట దర్శకుడు సందీప్ వంగా ఈ సినిమాని  3 గంటల 49 నిముషాలకు కట్ చేసారు.అది చాలా ఎంగేజింగ్ గా ఉంది. కానీ తర్వాత దాన్ని 3 గంటలా 21 నిమిషాలకు ట్రిమ్ చేసారు అన్నారు. ఇది విన్న అభిమానులు... ఇప్పుడు 3 గంటలా 21 నిమిషాలంటేనే ఎలా ఉంటుందో అనుకుంటున్నారు.అ దే మొదట కట్ చేసిన 3 గంటల 49 నిముషాల వెర్షన్ రిలీజ్ చేస్తే ఎలా ఉండేదో అంటన్నారు. ఇక  ఈ మధ్య  కాలంలో రిలీజైన చిత్రాల్లో  ఎక్కువ లెంగ్త్  ఉన్న బాలీవుడ్‌ చిత్రం ఇదే కానుంది. 

2016లో విడుదలైన ‘ధోనీ’ తర్వాత 3 గంటలకు పైగా నిడివి ఉన్న హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. ‘ధోనీ’ రన్‌టైన్‌ 3.10 గంటలు. ఇప్పుడున్న పరిస్దితుల్లో  మూడు గంటల సినిమా అంటే ఆలోచించి అడుగు వెయ్యాలి. కానీ, సందీప్‌ వంగా తన కథపై నమ్మకంతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఆయన తీసిన ‘అర్జున్‌ రెడ్డి’ కూడా మూడు గంటల సినిమాయే. అయితే, అదే సినిమాను హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో కాస్త లెంగ్త్ తగ్గించి తీశారు. మళ్లీ ఇప్పుడు ‘యానిమల్‌’ కోసం మరో డేరింగ్‌ స్టెప్‌ తీసుకున్నారనే చెప్పాలి.
 
ఇక   ఓ స్టార్ హీరో సినిమాకు ‘యానిమల్’ అనే టైటిల్‌ పెట్టడం వెనక కారణం చెప్పుకొచ్చారు.  సందీప్ వంగా మాట్లాడుతూ... సాధారణంగా మనకి చదువు, తెలివితేటలు వచ్చాయి కాబట్టి మనిషి అని పేరు పెట్టుకున్నామని.. నిజానికి మనిషి ఒక సోషల్ యానిమల్ అని సందీప్ అన్నారు. మనుషులకు ఐక్యూ ఉంది కాబట్టి కమ్యూనికేషన్ పెరిగి, ఫుడ్ చెయిన్‌లో మొదటిగా ఉంటూ వస్త్రాలు ధరించామని.. ఐక్యూ అనేది లేకపోతే మనం కూడా యానిమలే కదా అనేది తన వ్యక్తిగత భావన అని చెప్పారు. చిన్నప్పుడు సోషల్ స్టడీస్ చదువుకున్నప్పటి నుంచీ అలాగే అనిపించేదన్నారు. ‘నేను ఆలోచించింది ఏంటంటే.. యానిమల్‌కు ఐక్యూ ఉండదు. తన ప్రవృత్తితో ప్రవర్తిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో హీరో పాత్ర కూడా ప్రవృత్తితో వ్యవహరిస్తూ ఉంటుంది. అలాంటి పాత్రకు సంబంధించిన కథకు యానిమల్ అనే టైటిల్ బాగుంటుందని ఆ పేరు పెట్టాను’ అని సందీ వివరించారు.

ఇక ఈ చిత్రం కాన్సెప్టు గురించి చెప్తూ...‘యానిమల్’ను తండ్రీకొడుకుల ప్రేమకథగా అనుకోవచ్చని.. ప్రాథమిక కథ అదేనని చెప్పారు. ఒక వ్యక్తి కుటుంబం కోసం ఎంత దూరం వెళ్తాడనేది కథలోని సారాంశమన్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రకు ‘యానిమల్’లో రణ్‌బీర్ కపూర్ పాత్రకు ఉన్న పోలిక ఒక్కటేనని.. అది నిజాయితీ అని సందీప్ చెప్పారు. అర్జున్ రెడ్డికి కోపం వస్తే కంట్రోల్ చేయలేమని.. కానీ ‘యానిమల్’లో హీరో పాత్రకు మాత్రం సామాన్యంగా అందరికీ ఉండే కోపమే ఉంటుందన్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ రెండూ క్యారెక్టర్ బేస్డ్ సినిమాలేనని తెలిపారు. అయితే కథ, పాత్ర చిత్రీకరణ పూర్తిగా భిన్నంగా ఉంటుందన్నారు.

అలాగే సినిమాలో రష్మిక పోషించిన పాత్ర చాలా ముఖ్యమైనదని.. సినిమా ఆద్యంతం ఉంటుందని సందీప్ చెప్పారు. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలా కాకుండా చాలా డిఫరెంట్‌గా ఉంటుందన్నారు. హీరోని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా అర్థం చేసుకున్న భార్య పాత్రలో రష్మిక కనిపిస్తారన్నారు. హీరో తర్వాత అంత ప్రాధాన్యత రష్మిక, అనిల్ కపూర్ పోషించిన పాత్రలకే ఉందని చెప్పారు. తండ్రీకొడుకుల బంధంతో పాటు మంచి ప్రేమకథ కూడా ఉందన్నారు.
 
 ఇప్పటి వరకు ఇలాంటి సబ్జెక్ట్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై చూడని విధంగా యానిమల్ ఉంటుందట. దాంతో యానిమల్ పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీ పక్కా రివెంజ్ స్టొరీ అని తెలుస్తుంది.  యానిమల్‌ చిత్రాన్ని భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మిస్తున్నారు.  టీ సిరిస్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios