బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' చిత్రం ఆస్కార్ అవార్డు గెలిచి చరిత్ర సృష్టించింది. డెబ్యూ మహిళా దర్శకురాలు కార్తీకి గోన్సల్వేస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

ప్రపంచ సినిమాలో అత్యుత్తమ అవార్డుల వేడుక అయిన అకాడమీ అవార్డ్స్ ఘనంగా ప్రారంభం అయింది. మన నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుస్తుందా లేదా అనే ఉత్కంఠ అందరిలో ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాటు ఇండియా నుంచి డాక్యుమెంటరీ ఫిలిం ఆల్ దట్ బ్రీత్స్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విస్పరర్స్ కూడా నామినేషన్స్ లో నిలిచాయి. 

బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' చిత్రం ఆస్కార్ అవార్డు గెలిచి చరిత్ర సృష్టించింది. డెబ్యూ మహిళా దర్శకురాలు కార్తీకి గోన్సల్వేస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ది ఎలిఫెంట్ విస్పరర్స్ షార్ట్ ఫిలిం ఆస్కార్ అవార్డు సాధించి ఇండియాకి గర్వకారణంగా నిలిచింది. జంతువుల పట్ల ఇండియన్స్ చూపించే ప్రేమని ఈ షార్ట్ ఫిలిం లో చూపించారు. ఇద్దరు సౌత్ ఇండియా దంపతులు చిన్న ఏనుగుని దత్తత తీసుకుని పెంచిన కథని ఈ షార్ట్ ఫిలిం లో చూపించారు. 

Scroll to load tweet…