దీనిని వివాహేతర సంబంధం అనాలో, మరి స్వఛ్చమైన ప్రేమ అనాలో కూడా తెలియని పరిస్థితి. పెళ్ళైన వాడితో ప్రేమలో పడిన యువ సింగర్ అతని మరణవార్త విని కుప్పకూలిపోయింది. రాజస్థాన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇండియన్ ఐడల్ లో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి పోటీ ఇచ్చిన రేణు నగర్ ఆసుపత్రి పాలయ్యారు. ఒక్కసారిగా ఆమె ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చేర్చారు. అల్వార్ లోని ఓ ప్రేవేట్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తుండగా ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. 

విషయంలోకి వెళితే వివాహితుడైన రవి శంకర్ అనే వ్యక్తితో రేణు నగర్ ప్రేమలో పడ్డారు. ఈ  26ఏళ్ల సింగర్ ఇంటికి రవి శంకర్ సంగీత పాటాల కోసం రోజూ వస్తూ వుండేవాడట. ఈ క్రమంలో వీరి మధ్య పరిచయం, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్ళైన వ్యక్తితో వివాహం అంటే జరగని పని. అలాగే వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న రేణు నగర్ తల్లిదండ్రులు ఆమెను కట్టడి చేసినట్లు సమాచారం. 

దీనితో ఈ జంట ఈ నెలలో లేచిపోవడం జరిగింది. రేణు నగర్ తల్లిదండ్రులు పోలీసు కేసు పెట్టడంతో, వాళ్ళను పోలీసులు వెతికి పట్టుకొచ్చి వాళ్లకు అప్పగించారు. ఈనెల 24న వీరు తమ సొంత ఇళ్లకు చేరడం జరిగింది. వీరిద్దరూ కనీసం కలుసుకోవడానికి కూడా కుదరకపోవడంతో మనస్థాపానికి గురైన రవిశంకర్ విషం తాగారు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రేణు కుప్పకూలిపోయింది.