భారతీయ నటి అనసూయ సంచలనం సృష్టించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డుని సొంతం చేసుకున్నారు. ఉత్తమ నటిగా ఆమె అవార్డుని దక్కించుకోవడం విశేషం. 

అనసూయకి ఇంటర్నేషనల్‌ అవార్డు వరించింది. ప్రతిష్టాత్మకంగా భావించే కేన్స్ పురస్కారం ఆమెని వరించింది. ఉత్తమ నటిగా ఆమెకి ఈ అవార్డు దక్కడం విశేషం. అయితే ఆ అనసూయ మన యాంకర్‌ అనసూయ కాదు. ఇండియన్‌ నటి అనసూయ సేన్‌ గుప్తా. గోవాలో ఉంటూ ముంబయిలో ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పనిచేసిన ఆమెకి కేన్స్ లో అన్‌ సర్జైన్‌ రిగార్డ్స్ విభాగంలో ఉత్తమ నటిగా అవార్డు దక్కడం విశేషం. బల్గేరియన్‌ డైరెక్టర్‌ కాన్‌ స్టంటిన్‌ బొజనోవ్‌ తెరకెక్కించిన `ది షేమ్‌ లెస్‌` మూవీలో అనసూయ సేన్‌ గుప్తా ప్రధాన పాత్రలో నటించింది. 

ఈ మూవీలో మరో ఇండియా నటుడు వశిష్ట్ కూడా నటించడం విశేషం. ఈ సినిమా షూటింగ్‌ నెలన్నరపాటు ఇండియా, నేపాల్‌లో జరిగింది.  శ్యామ్ బెనెగల్ నుంచి వచ్చిన `మంతన్` తర్వాత 48ఏళ్లకు ఇండియన్ సినిమా కేన్స్ లో ప్రదర్శించబడటం విశేషం. కేన్స్ వేడుకలో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న తొలి ఇండియన్​ గా నిలిచారు అనసూయ. ఆమె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు అందుకుంటూ, దానిని క్వీర్ కమ్యూనిటీకి డెడికేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. `చాలా కమ్యూనిటీల వారంతా తప్పనిసరి పరిస్థితుల్లో బతుకుతూ జీవితంతో పోరాడుతున్నారు. వలసవాదులు ఎంత దయనీయంగా బతుకుతున్నారో మనమంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది` అంటూ ఎమోషనల్‌ అయ్యింది అనసూయ. 

దర్శకులు బొజనోవ్‌కు ఫేస్‌బుక్ ఫ్రెండ్ అనసూయ. ఒకసారి ఆమెను సర్‌ప్రైజ్ చేస్తూ ఆడిషన్ చేసి వీడియో పంపమని అడిగారు. యాక్టింగ్ అంటే తెలియని ఆమెకు ఆడిషన్ అదే ఫస్ట్ టైం. అలా సెలక్టైన ఆమె 'ద షేమ్ లెస్'లో నటించే అవకాశం కొట్టేసింది. ఇందులో ఒక సెక్స్ వర్కర్ అయిన రేణుకా పాత్ర పోషించారు అనసూయ. ఇక ఈ మూవీ స్టోరీ చూస్తే, సెక్స్ వర్కర్ అయిన రేణుక(అనసూయ) ఢిల్లీలో ఒక పోలీసుని మర్డర్ చేసి మరో రాష్ట్రానికి వెళ్లిపోతుంది. ఆ రాష్ట్రంలోనూ వేరే కమ్యూనిటీలో జాయిన్ అయి మరో సెక్స్ వర్కర్‌ను ప్రేమిస్తుంది. ఆమెతో కలిసి జీవితాన్ని పంచుకోవడం కోసం పోరాడుతుంది. రేణుకతో ప్రేమలో పడే మరో టీనేజర్ అయిన దేవికా పాత్రను ఒమర శెట్టి పోషించారు. సెక్స్ వర్కర్‌గా అద్భుతంగా నటించి మెప్పించారు అనసూయ. సినిమాల్లోకి రాకముందు ఆమె  శ్రీజిత్ ముఖర్జీ తీసిన `ఫర్‌గెట్ మీ నాట్`, సత్యజిత్ రే ఆంతాలజీ, మసబా మసబాలకు ప్రొడక్షన్ డిజైనర్​గా పనిచేశారు అనసూయ.
 

Scroll to load tweet…