Asianet News TeluguAsianet News Telugu

ఓటిటిలోకి 'భారతీయుడు-2 '...అంత త్వరగానా?

భారతీయుడు 2  సినిమాకు మార్నింగ్ షో నుంచి ప్లాఫ్ టాక్ వచ్చేసింది.  సినిమా ట్రిమ్ చేసామన్నా మరొకటి అన్నా జనం థియేటర్స్ వెళ్లి చూడటం  లేదు.

Indian 2 disastrous performance makes Early OTT streaming? jsp
Author
First Published Jul 22, 2024, 9:11 AM IST | Last Updated Jul 22, 2024, 9:11 AM IST


సినిమా రిజల్ట్ కు ఓటిటి స్ట్రీమింగ్ డేట్స్ కు లింక్ ఉంటుంది. ముందుగా సినిమా హిట్ అవుతుందనుకుని ఎగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఓ డేట్ అనుకుంటారు. కానీ తర్వాత సినిమా రిజల్ట్ అటూ ఇటూ అయితే డేట్స్ మారుస్తూంటారు. అది ఎగ్రిమెంట్ లోనే ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని సూపర్ హిట్ సినిమాలకు ఎగ్రిమెంట్ మార్చి ఓటిటి తేదీలు మరింత ముందుకు తీసుకెళ్లినవి ఉన్నాయి. అలాగే డిజాస్టర్ అయిన సినిమాలు నెలలోపే , కొన్ని సార్లు రెండు వారాలు లోపే ఓటిటిలోకి వచ్చినవి ఉన్నాయి. ఈ క్రమంలో భారతీయుడు 2 చిత్రం కూడా ఓటిటి డేట్ మారిందని తెలిసింది. 

భారతీయుడు 2  సినిమాకు మార్నింగ్ షో నుంచి ప్లాఫ్ టాక్ వచ్చేసింది.  సినిమా ట్రిమ్ చేసామన్నా మరొకటి అన్నా జనం థియేటర్స్ వెళ్లి చూడటం  లేదు.   దాంతో వీకెండ్ కలెక్షన్స్ లో బాగా డ్రాప్ కనపడింది. ఓపినింగ్స్  ఫరవాలేదనిపించినా శనివారం నాటికే నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యి మొత్తం దెబ్బ కొట్టేసింది.   మరో ప్రక్క శంకర్ మీద  ఓరేంజిలో  ట్రోలింగ్ మొదలైంది.  భారతీయుడు 2 (ఇండియన్ 2)ని, బాలయ్య చిత్రం ఒక్క మగాడు తో పోల్చుతూ కామెడీ చేసేసారు. 

  ముఖ్యంగా  కమల్ హాసన్ గెటప్స్, లుక్స్, సిద్దార్థ్ ఓవర్ యాక్షన్ మీద  ట్రోలింగ్ నడించింది. చాలా మంది భారతీయుడు 2 చూసి వచ్చి ...దాని తలనొప్పి నుంచి బయిటపడటానికి  భారతీయుడు పార్ట్ వన్  చూడాలంటూ కామెంట్లు వచ్చాయి. ఈ మూవీని తెలుగులో అందరూ తిరస్కరించారు. తమిళంలోనూ అంతంతమాత్రంగానే కలెక్షన్లు వచ్చాయి. 

ఇక ఈ సినిమా ఓటిటి రైట్స్ ని నెట్ ప్లిక్స్ వారు భారీ రేటు పెట్టి కొనుగోలు చేసారు. తమిళంలో ఇదే హైయిస్ట్ రేటుగా చెప్పుకున్నారు. ఈ సినిమా మొదట ఎగ్రిమెంట్  6 – 8 వారాల్లో స్ట్రీమింగ్ అయ్యేలా చేసుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు సినిమా డిజాస్టర్ టాక్ చూసాక...మొత్తం మారిపోయింది. ఈ సినిమాని ఆగస్ట్ 2 నుంచి స్ట్రీమ్ చేసేందుకు నెట్ ప్లిక్స్, నిర్మాతలతో మాట్లాడి ఎగ్రిమెంట్స్ మారుస్తున్నట్లు సమాచారం. 
 
 రెండున్నర దశాబ్దాల కిందట వచ్చిన భారతీయుడు చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రానికి సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై భారతీయుడు-2 చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ చ్రితంలో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని తదితరులు నటించారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios