Asianet News TeluguAsianet News Telugu

ఇండియాలో ఫస్ట్ టైమ్ : థియేటర్ లో బార్, వైన్స్...ఎక్కడంటే

ఇక తాగుతూ,తింటూ సినిమాని ఆస్వాదించవచ్చు..అది ముంబైలోని ఓ థియేటర్ లో సాధ్యమవుతోంది. క్లిక్ అయితే హైదరాబాద్ వంటినగరాలుకు విస్తరిస్తారు.

India gets its first cinema with a Bar and lounge! jsp
Author
First Published Dec 6, 2023, 9:55 AM IST


ఇంతకు ముందు రోజుల్లో థియేటర్స్ అంటే కేవలం సినిమాలు చూడటానికి మాత్రమే. అయితే ఇప్పుడు ఇళ్లే థియేటర్స్ గా మారుతున్న నేపధ్యంలో థియేటర్స్ లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. లగ్జరీ సీట్స్ తో పాటు సకల సౌకర్యాలు ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. ఆ క్రమంలో తాజాగా జియో వారు కొత్త ఆలోచన చేసారు. థియేటర్ లో బార్ అండ్ లాంజ్ ని ఏర్పాటు చేసారు. భారతదేశంలో ఇలాంటి థియేటర్ ఇదే మొదటిది కావటం విశేషం. ఇక్కడ కాకటైల్స్ అందిస్తారు. ప్రముఖ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారత మార్కెట్లో అతిపెద్ద లగ్జరీ మాల్ జియో వరల్డ్ ప్లాజా (Jio World Plaza Mall)ను ప్రారంభించింది. అందులో  ఈ థియేటర్స్ ఉన్నాయి.

ముంబై మహానగరంలో అతిపెద్ద షాపింగ్ మాల్ జియో వరల్డ్ ప్లాజా నెల క్రితం నవంబర్ 1న ప్రారంభమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ బాండ్రా కుర్లా కాంప్లెక్స్ ఏరియాలో దీనిని నిర్మించారు. జియో వరల్డ్ ప్లాజాలో 66 లగ్జరీ బ్రాండ్ కంపెనీలు తమ స్టోర్లను ఏర్పాటు చేశాయి. ముంబైలో అసమానమైన లగ్జరీ షాపింగ్ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ప్లాజాను తీర్చిదిద్దారు. ఇందులో వ్యక్తిగత షాపింగ్ సహాయం, మల్టీప్లెక్స్ థియేటర్, గౌర్మెట్ ఫుడ్ ఎంపోరియం వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి.  ఇప్పుడీ బార్ అండ్ రెస్టారెంట్ ముంబైలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. 

ఇక ఈ థియేటర్ లో యానిమల్ సినిమా ప్రదర్శింపబడుతోందని తెలుస్తోంది. భారత ఆర్థిక రాజధాని ముంబైలోని బాంద్రా కుర్లూ కాంప్లెక్స్‌‌లో ఈ లగ్జరీ మాల్‌ను రిలయన్స్ ఏర్పాటు చేసింది. దేశంలో టాప్-ఎండ్, గ్లోబల్ స్టాండర్డ్ షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు రిటైల్ జియో వరల్డ్ ప్లాజాను ప్రారంభించనుంది. ముంబై నడిబొడ్డున BKCలో జియో వరల్డ్ ప్లాజా (JWP), నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్‌కు దగ్గరగా సందర్శకులకు సులభంగా ఉండేలా ఏర్పాటు చేసింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios