ఎట్టకేలకు సాధించిన ఇనయా, బిగ్ బాస్ హౌస్ చివరి కెప్టెన్ గా గెలుపు, సెమీ ఫైనల్స్ కు ఫస్ట్ కంటెస్టెంట్ ఎట్టకేలక
బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఫైనల్స్ కు చేరే సమయం దగ్గరలో ఉంది. ఇక రాను రాను ఆట చాలా ఇంట్రస్ట్ గా.. చాలా టఫ్ గా మారుతుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఫైనల్ కు సబంధించి సిగ్నల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ వీక్ లో బిగ్ బాస్ హౌస్ చివరి కెప్టెన్ ను ఎన్నుకున్నారు.

ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అవ్వాలి అన్న తన కలను నెరవేర్చుకుంది ఇనయ. తన కోరిక తో పాటు హౌస్ లోకి వచ్చి అడిగిన తన తల్లి కోరికను కూడా తీర్చింది ఇనయ. . బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యింది. అందరిలో ఏదో వారం అయితే మజా ఏముంటుంది అనుకుందో ఏమో కానీ.. కీలకమైన చిట్టచివరి కెప్టెన్సీ పోటీలో గెలిచి.. బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యింది ఇనయ. అంతే కాదు సెమీ ఫైనల్స్ కు చేరిన ఫస్ట్ కంటెస్టెంట్ గా కూడా నిలిచింది.
బగ్ బాస్ లో ఈ రోజు స్టార్ట్ అవ్వడమే హౌస్ లో ఫ్యామిలీని కోసం ఎదురు చూస్తున్న ఏకైక మెంబర్ రేవంతో కోసం తన భార్య తో స్క్రీన్ మీద మాట్లాడించారు బిగ్ బాస్. ఆరతువాత రేవంత్ అమ్మగారు హౌస్ లోకి వచ్చి కాసేపు సందడి చేశారు. ఈక్రమంలో అమ్మ, భార్య కోరిక మేరకు రేవంత గడ్డం తీస.. హ్యాండ్సమ్ గా తయారయ్యాడు.
ఈ వారం వరకూ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో దాదాపు అందరూ కెప్టన్ అయ్యారు. కొంత మంది రెండు సార్లు అయ్యారు. కాని ఇనయ, రోహిత్ మాత్రం ఇప్పటి వరకూ కెప్టెన్స్ అవ్వలేదు. దాంతో ఈ సారి కెప్టెన్సీ టాస్క్ చాలా ఇంపార్టెంట్ అయ్యింది. అందరరికి సాధించే అవకాశం ఇవ్వడంతో అందరూ ఈ విషయంలో బెస్ట్ ఇచ్చారు. కాని గేమ్ నుంచి ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు.
చివరిగా శ్రీసత్య - ఇనయా మిగలగా.. వారిద్దరి మధ్య టఫ్ పోటీ నడిచింది. వీళ్లిద్దరూ టాస్క్‌లలో మంచి పెర్ఫామ్ ఇచ్చారు. హోరా ఓరీ పోరు నడిచింది. చివరకు కెప్టెన్ అవ్వాలి అని కోరికతో రెచ్చిపోయిన ఇనయ శ్రీసత్యను ఎక్కడికక్కడ నిలువరించింది. అయితే బిగ్ బాస్ హౌస్‌లో వచ్చేవారం నుంచి సెమీ ఫైనల్ స్టార్ట్ కాబోతుండంతో.. హౌస్‌కి కెప్టెన్ అవ్వాలంటే ఇది చివరి అవకాశం కావడంతో.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హౌస్‌కి కెప్టెన్ అయ్యింది ఇనయ సుల్తానా.ఈవారం కెప్టెన్ అయిన వాళ్లు నేరుగా సెమీ ఫైనల్ వీక్‌లోకి అడుగుపెట్టబోతుండటంతో.. ఇనయ సెమీ ఫైనల్‌కి వెళ్లిపోయింది. అంటే ఫైనల్‌కి ఒక్క అడుగుదూరంలో ఉంది ఇనయ.
మొత్తానికి తన కోరికతో పాటు తన తల్లి కోరికను తీర్చింది ఇనయ. నిన్నటి ఎపిసోడ్‌లో ఇనయ సుల్తానా తల్లి వచ్చి.. నువ్ కెప్టెన్ కావాలని కోరింది. ఆమె కోరినట్టుగానే బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యింది ఇనయ. అయితే కెప్టెన్ అవ్వాలనే కోరికతో పాటు.. టైటిల్ గెలిచిరావాలని తన కోరికను వెల్లడించింది. ఇక హౌస్ లో మళ్లీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. గేమ్ ఎలిమినినేషన్ విషయంలో రేవంత కు ఫైమాకు మధ్య గట్టిగా వాగ్వాదం జరిగింది. ఇక కీర్తి తన వేలుబాగోలేక ఇలా జరగడంతో చాలా బాధపడింది. ఇక రోహిత్ కెప్టెన్ కాలేకపోయినందకు ఎమోషనల్ అయ్యాడు. ఏడ్చేశాడు.