మహేష్ తనపై తానే సెటైర్ వేసుకున్నాడు. అందరూ మహేష్ కి వయసు పెరగడం లేదని పొగుడుతున్నారు. అయితే అలా గ్లామరస్ గా కనిపించడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని మహేష్ పరోక్షంగా తెలియజేశారు.
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఎవరంటే... మహేష్ బాబు అని తడుముకోకుండా చెప్పేస్తారు ఎవరైనా. ఆ రేంజ్ గ్లామర్ ఆయన సొంతం. మహేష్ కంటే వయసులో చిన్నవాళ్ళైన ఈ తరం హీరోలు చాలా మంది వయసుకు మించి కనిపిస్తుంటే మహేష్ (Mahesh Babu)మాత్రం ఓ 20ఏళ్ళు తక్కువగా తోస్తున్నాడు. మరి అలా కనిపించడం అంత సులువు కాదు. జన్మతః మంచి గ్లామర్ వచ్చినా ఓ ఏజ్ వచ్చాక దాన్ని మైంటైన్ చేయాలంటే చాలా కేర్ తీసుకోవాలి. ఈ విషయాన్నే మహేష్ తన లేటెస్ట్ మూవీ ట్రైలర్ లో చెప్పాడు.
ట్రైలర్ లో మహేష్... ''ఏమయ్యా కిషోర్ మనకేమైనా మ్యారేజ్ చేసుకునే వయసొచ్చేసిందంటావా?'' అని వెన్నెల కోశోర్ ని అడిగాన్నే ''ఊరుకోండి సార్... మీకేంటి పెళ్లి అప్పుడే? మీరింకా చిన్నపిల్లాడైతేనూ'' అంటాడు. దానికి మహేష్.. ''అందరూ నీలాగే అనుకుంటున్నారయ్యా... దీనెమ్మ మైంటైన్ చేయలేక దూల తీరిపోతుంది'' అంటూ డైలాగ్ చెప్పారు. ఈ డైలాగ్స్, సన్నివేశం మహేష్ నిజ జీవితానికి సంబంధించిందే. మహేష్ తనపై తానే సెటైర్ వేసుకున్నాడు. అందరూ మహేష్ కి వయసు పెరగడం లేదని పొగుడుతున్నారు. అయితే అలా గ్లామరస్ గా కనిపించడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని మహేష్ పరోక్షంగా తెలియజేశారు.
అందంగా కనిపించడం అంటే మాటలు కాదు. తినే తిండి, అలవాట్లు, వ్యాయామం విషయంలో నిబద్ధతగా ఉండాలి. లేదంటే చాలా ఈజీగా అందం ఆవిరైపోతుంది. టాలీవుడ్ లో కింగ్ నాగార్జునతో పాటు మహేష్ ఆరోగ్యం,అందం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒకప్పుడు మహేష్ కి విపరీతమైన స్మోకింగ్ అలవాటు ఉండేదట, క్రమంగా ఆ బ్యాడ్ హ్యాబిట్ ఆయన వదిలేసినట్లు సమాచారం.
కాగా సర్కారు వారి పాట ట్రైలర్ (Sarkaru Vaari Paata Trailer) సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటుంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్ ఉంది. ట్రైలర్ తో సర్కారు వారి పాట థియేటర్స్ లో పూనకాలే అని నిరూపించాడు. ట్రైలర్ ఆరంభమే మహేష్ క్యారెక్టర్ ఏమిటో తెలియజేసింది. ''మీరు నా ప్రేమను దొంగిలించగలరు, స్నేహాన్ని దొంగిలించగలరు, కానీ నా డబ్బును దొంగించలేరు'' అని మహేష్ చెప్పడం ఆయన ఎంత మనీ మైండెడో తెలియజేస్తుంది. అదే సమయంలో రూపాయికి విలువిచ్చే మనిషిగా కనిపిస్తున్నాడు. మహేష్ లోని ఈ నేచర్ వెనుక కారణం ఏమిటనేది అసలు కథ.
ట్రైలర్ ద్వారా మహేష్ లోని మాస్, క్లాస్ యాంగిల్స్ పరిచయం చేశారు. కీర్తి సురేష్ తో ఆయన రొమాన్స్, కెమిస్ట్రీ క్లాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ అయితే, మాస్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ కలిగించే యాక్షన్, డైలాగ్స్ పుష్కలంగా ఉన్నాయి. మహేష్ చెప్పిన కొన్ని డైలాగ్స్ చూస్తుంటే ఆయన క్యారెక్టర్ చాలా రఫ్ గా ఉంటుందని అర్థమవుతుంది. రెండున్నర నిమిషాల ట్రైలర్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచింది.
మహేష్ సర్కారు వారి పాట చిత్రంతో ఓ భారీ కమర్షియల్ హిట్ ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అలాగే కీర్తి సురేష్ (Keerthy Suresh)గ్లామర్ కూడా హైలెట్ గా ఉంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ముచ్చటగా ఉండే అవకాశం కలదు. ఇక ట్రైలర్ లో సముద్ర ఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజ్ కనిపించారు. సముద్ర ఖని మెయిన్ విలన్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. కాగా మే 12న సర్కారు వారి పాట వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న విషయం తెలిసిందే. థమన్ సంగీతం అందిస్తుండగా సాంగ్స్ ఆదరణ దక్కించుకున్నాయి.
