ఆస్కార్ లో మన తెలుగువాళ్ళ సత్తా ఎంటో చూశాం. చాలా రోజులు గా మన హీరోలు హాలీవుడ్ లో ఆస్కార్ ప్రమోషన్  కోసం సందడి చేశారు. హాలీవుడ్ స్టార్ మేకర్స్ ను కలిశారు. అమెరికాలో ఎన్టీఆర్, చరణ్ లు ఏమాత్రం తగ్గకుండా బ్రాండెడ్ వస్తువులు వాడి.. ఓ రేంజ్ లో కనిపించారు. ఈక్రమంలోనే ఎన్టీఆర్  అమెరికాలో పెట్టుకున్న వాచ్ కాస్ట్ గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వాచ్ కాస్ట్ ఎంతో తెలుసా..?

రీసెంట్ గా ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈసారి మన ఇండియాకు రెండు ఆస్కార్లు రావడం ప్రతీ ఒక్కరికి సంతోషాన్నిచ్చింది. ముఖ్యంగా తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ తో టాలీవుడ్ కు సరికొత్త రికార్డ్ ను కట్టబెట్టింది. ఈక్రమంలో ఆస్కార్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్ళిన చరణ్ , తారక్ అక్కడ గట్టిగా సందడి చేశారు. హాలీవుడ్ హీరోలలో మన వాళ్లు కూడా కలిసి పోయారు. ఈక్రమంలో మన హీరోలు వేసుకున్న కాస్ట్యూమ్స్.. వాచ్, షూష్ ఇలా ప్రతీది బ్రాండెడ్ అండ్ కాస్ట్లీ వి వాడారు. అంతా ఆస్కార్ సందడి లో ఉండగా.. కొంత మంది నెటిజన్ల కన్ను ఈ ఇద్దరు హీరోలు వాడిన కాస్ట్లీ ఐటమ్స్ మీద ఉంది. ఈక్రమంలో ఎన్టీఆర్ వాచ్ పై పడింది సోషల్ మీడియా కన్ను. 


ఆస్కార్ కు ముందు చరణ్ – తారక్ ఇద్దరూ కూడా సినిమాప్రమోషన్స్ లో జోరుగా పాల్గొన్నారు. ప్రతీ ఈవెంట్ లో.. ప్రతీ ఇంటర్వ్యూలో స్టైలిష్ లుక్ లో మెరిసిపోయారు.. ఆస్కార్స్ కోసమే వారు ప్రత్యేకంగా డ్రెస్సెస్ డిజైన్ చేయించుకున్నట్టున్నారు.. ఇద్దరూ కూడా లాస్ ఏంజెల్స్‌లో పలు ప్రమోషన్లలో అల్ట్రా స్టైలిష్ లుక్‌లో అదరగొట్టేశారు.నెవర్ బిఫోర్ అనేలా కనిపించి ఫ్యాన్స్, ఆడియన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ముఖ్యంగా తారక్ సూపర్బ్ డ్రెస్సింగ్‌తో పాటు చేతికి పెట్టుకున్న వాచ్ కూడా ఆకర్షణీయంగా ఉంది.. దీంతో తమ ఫేవరెట్ యాక్టర్ వాచ్ కాస్ట్ గురించి ఫ్యాన్స్ నెట్టింట తెగ సెర్చ్ చేశారు.. తీరా ఆ వాచ్ ధర తెలిసి షాక్ అవుతున్నారు..

యంగ్ టైగర్ పెట్టుకున్న వాచ్ Patek Phillipe Nautilus Travel Time. ఈ వాచ్ రేటు అక్షరాలా 190,000 డాలర్స్. అంటే మన రూపాయల్లో 1 కోటి 56 లక్షల 13,155. ఈ రేటు చూసి ఫ్యాన్స్ ఔరా అంటున్నారు. ఇంత రేటు పెట్టారంటే.. ఇందులో ఎన్ని అడ్వాస్స్ ఫీచర్స్ ఉంటాయో అని అనుకుంటున్నారు నెటిజనల్లు.. తారక్ వాచ్ గురించి న్యూస్ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ ఏది కొన్నా అదే రేంజ్ లో కాస్ట్ పెడతాడు. గతంలో కూడా తారక్ వాచ్ చోసం కోట్లు పెట్టాడు. 

 తారక్ వాచ్ లకోసం భారీగా ఖర్చు పెట్టడం ఇదేం కొత్త కాదు. గతంలో ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్ లో ఇలాంటి వాచ్ నే పెట్టుకున్నాడు. వాచ్ చూసి.. ఇదేదో బాగుందే.. ఎంత కాస్ట్ అవుతుందబ్బా అని అనుకుంటూ.. ఆన్ లైన్ లో ఆ వాచ్ కాస్ట్ ను సెర్చ్ చేశారు ఫ్యాన్స్. ఆ వాచ్ కాస్ట్ చూసి.. బొమ్మ కనిపించింది వారికి. ఆ వాచ్ రేటు అక్షరాలా నాలుగు కోట్లు. నాలుగు కోట్ల వాచ్ ఏంటీ బ్రో అని అనిపింస్తుంది కదా.. అవును Richard Mille rm 011 CarbonNtpt Grosjean Rose Gold lotus F1 Team limited Edition వాచ్ ఖరీదు ఆన్ లైన్ లో 3కోట్ల 99 లక్షల32 వేల 392 రూపాయాలు చూపిస్తుంది.

నిజానికి సెలబ్రెటీలు.. అందులోను ఫిల్మ్ సెలబ్రెటీలు.. అందులోను మన టాలీవుడ్ సెలబ్రెటిలది లగ్జరీ లైఫ్. ఏదో ఒక కాస్ట్లీ వస్తువు కొని అప్పుడప్పుడు వార్తల్లో ఉంటుంటారు మనవాళు. అందులోనూ.. ఎన్టీఆర్ అయితే ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటాడు. ఎందుకంటే అంతకు ముందు కూడా తారక్ ఇలాంటి కాస్ట్లీ ఐటమ్స్ చాలా కొన్నాడు. రాజమౌళి కొడుకు పెళ్లికి జైపూర్ వెళ్లినప్పుడు కూడా కాస్ట్లీ వాచ్ పెట్టుకుని హాట్ టాపిక్ అయ్యారు Ntr. అప్పట్లో ... రెండున్నర కోట్ల విలువ చేసే Richard Mille RM 11-03 McLaren automatic flyback chronograph watch ను పెట్టుకుని కనిపించారు. 

లగ్జరీ, కాస్ట్లీ ఐటమ్స్ ను ఎన్టీఆర్ ఎక్కువగా కొంటుంటారు. ఆమధ్య తనకు ఇష్టమైన Lamborghini Urus Graphite Capsule కార్ ను ఇష్టపడి బుక్ చేసుకున్నారు. ఈ కారును ఇండియాలో ఫస్ట్ బుకింగ్ చేసుకున్నది ఈ హీరోనే. ఈ కారు ఖరీదు దాదాపు మూడున్నర కోట్లు. టాక్స్ లతో కలుపుకుని భారీగానే ఖర్చు చేసి తనకిష్టమైన కారును సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇలా తారక్ ప్రతీ సారి కాస్ట్లీ వాచ్ లతో.. కార్లతో.. ఆడియన్స్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తూనే ఉన్నాడు.