సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు అనేవి కామన్ అయిపోయాయి. చాలా మంది నటులు ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో స్టార్ కపుల్ చేరబోతుంది.

బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ ఆయన భార్య అవంతిక విడిపోవడం ఖాయమని అంటున్నారు. గత కొద్దిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతుండడంతో పెద్దలు కలుగజేసుకొని పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇమ్రాన్ ఖాన్ సొంత మావయ్య ఆమిర్ ఖాన్ రంగంలోకి దిగినప్పటికీ మేనల్లుడి కాపురాన్ని చక్కదిద్దలేకపోయాడు.

కొద్దిరోజుల క్రితం అవంతిక తన ఐదేళ్ల కూతురుని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇమ్రాన్-అవంతికలు కలిసి ఉండడం లేదు. హీరోగా ఇమ్రాన్ కి సినిమాలు రాకపోవడం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అవకాశాలు రాకపోవడంతో ఇప్పుడు దర్శకుడిగా మారాడు. 

ప్రొఫెషనల్ లైఫ్ లో ఉన్న ఒత్తిడిని భార్యపై చూపించడంతో వారి కాపురంలో కలతలు వచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 8 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకి 2014లో ఓ పాప కూడా పుట్టింది. అంతా సక్రమంగా జరుగుతుందనుకున్న సమయంలో ఇలా విడిపోయే పరిస్థితి ఏర్పడింది.