ముంబాయి మాఫియా క్వీన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘గంగూబాయి కతియావాడి’ (Gangubai Kathiawadi). ఈ చిత్రం మూడు రోజుల్లో రిలీజ్ కానుండగా... మహారాష్ట్ర ఎమ్మెల్యే ఈ సినిమాపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టును ఆశ్రయించారు.
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ (Alia Bhatt) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గంగూబాయ్ కతియావాడీ’. ముంబయి మాఫియా క్వీన్ గంగూబాయ్ జీవితచరిత్ర ఆధారంగా దీన్ని రూపొందించారు. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా కోసం హిందీ సినీ ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగులోనూ ఈ మూవీని రిలీజ్ చేస్తుండటంతో ఇటు సౌత్ ఆడియెన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 25న ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా మూవీపై అభ్యంతరం తెలుపుతూ ఎమ్మెల్యే, కామాతిపుర నివాసిగా సినిమాలో ప్రాంతం పేరును ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
మహారాష్ట్ర ఎమ్మెల్యే అమీన్ పటేల్, దక్షిణ ముంబైలోని కమాతిపురా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా బాలీవుడ్ చిత్రం గంగూబాయి కతియావాడిలో ఈ ప్రాంతం పేరును ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దానిని సెన్సార్ చేయాలని లేదా తొలగించాలని కోరారు. గతంలోనూ అనేక వ్యభిచార గృహాలు నిర్వహించే కామాతిపుర నివాసి శ్రద్ధా సర్వే అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు గౌతమ్ పటేల్, మాధవ్ జామ్‌దార్‌లతో కూడిన డివిజన్ బెంచ్‌లో మంగళవారం ప్రస్తావించారు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానున్నందున అత్యవసర విచారణను కోరారు. కాగా రేపు విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. ఇదే విధమైన అభ్యంతరాన్ని లేవనెత్తుతూ ఎమ్మెల్యే అమీన్ పటేల్ దాఖలు చేసిన పిల్‌ను చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ముందు ప్రస్తావించారు. దీనిపైనా కూడా బుధవారామే విచారణ జరపనున్నట్టు బెంచ్ పేర్కొంది.
సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన చిత్రం, రచయిత S హుస్సేన్ జైదీ యొక్క పుస్తకం మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబైలోని ఒక అధ్యాయం ఆధారంగా, 1960 లలో కామాతిపుర నుండి వచ్చిన అత్యంత శక్తివంతమైన, ప్రియమైన, గౌరవనీయమైన మేడమ్‌లలో ఒకరైన గంగూబాయిగా అలియా భట్ నటించారు.అయితే ఈ సినిమా కామాతిపుర ప్రాంతాన్ని చెడుగా చూపుతుందని, అక్కడ నివసించే వారిని కించపరిచేలా మరియు పరువు తీసేలా ఉందని.. సర్వే దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.
