వైరల్ టాక్: రజనీని ఉద్దేశించేనా .. చిరు ఆ కామెంట్స్?
రజనీ జైలర్(ఆగస్టు 9న), చిరంజీవి భోళా శంకర్ (ఆగస్టు 11న) కేవలం రెండు రోజుల వ్యవధిలోనే థియేటర్లలో విడుదలయ్యాయి. భోళా శంకర్ ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని అపజయాన్ని మూటగట్టుకోగా జైలర్ హిట్ టాక్‌తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.

ఆగస్ట్ నెలలో చిరంజీవి (Chiranjeevi), రజనీకాంత్ (Rajinikanth) తమ తమ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీ నటించిన ‘జైలర్’ ఆగస్టు 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నెల్సన్ టేకింగ్, రజనీ స్టైల్, మాస్ యాక్షన్ అభిమానులనే కాదు, సినీ ప్రేక్షకులను అలరించాయి. ఇక ఆగస్టు 11న చిరంజీవి-మెహర్ రమేశ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘భోళా శంకర్’ విడుదలైంది. చిరంజీవి నటన, అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో మెరుపులు తప్ప సినిమా ఏమాత్రం మెప్పించలేకపోయింది. డిజాస్టర్ అయ్యింది. అభిమానులు సైతం ఈ సినిమా ఫలితంపై నిరాశ పడ్డారు. అయితే జైలర్ లో రజనీ కన్నా భోళా శంకర్ లో చిరంజీవి ఎక్కువ కష్టపడ్డారనేది మాత్రం నిజం.
స్టార్ హీరో సినిమా అనగానే మామూలుగా ఓ లవ్‌స్టోరీ, విలన్, నాలుగు పాటలు, ఫైట్.. ఇదే సే మ్ టు సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. అవి సక్సెస్ సాధిస్తూంటాయి. అలాంటి వాటిల్లో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద హిట్టైన 'జైలర్'. సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రంలో హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్ లేదు. రొమాంటిక్ పాటలు లేవు. రౌడీలను హీరో చితక్కొట్టే సన్నివేశాలు కూడా పెద్దగా లేవు. అయినా చిత్రం బ్లాక్‌బస్టర్. కొంత కాలంగా వరుస పరాజయాలతో ఉన్న రజనీ.. జైలర్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమాలో రజినీకాంత్ కేవలం అలా నడుచుకుంటూ వెళ్ళి సక్సెస్ ఇచ్చారని చాలా మంది అన్నారు. జైలర్ లో అనిరుద్ రవిచందర్ చేసిన మేజిక్ చాలా లోపాలను కవర్ చేసారన్నారు. ఈ విషయం గత కొద్ది రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గదా మారింది. దాదాపు ఇలాంటి విషయం మీదే చిరంజీవి రీసెంట్ గా మాట్లాడారు.
చిరంజీవి మాట్లాడుతూ...``నేను అనుకుంటాను... ఇంకా ఎన్నాళ్లు డాన్స్ లు చేయాలి, ఫైట్స్ చేయాలి.. ఏంట్రా చాల్లేరా బాబు అని. నడుచుకుంటూ వెళ్లి రీరికార్డింగ్ తో భమ్ అని మన హీరోయిజం లేపేస్తే హాయిగా షూటింగ్ వెళ్లావా, మేకప్ తుడుచుకున్నావా..డబ్బులు ఇచ్చారా జేబులో పెట్టుకున్నావా.. అంటే ఎంత బాగుంటుంది. అలాంటి పరిస్దితి కాదు మనది. నటించాలి.. డ్యాన్స్ లు చేయాలి.. ఫైట్ చేయాలి.. ఒరిజనల్ గా అన్ని మననే చేయాలి. ఒళ్లు హూనం చేసుకోవాలి. నా శరీరాన్ని కష్టపెట్టాలి అప్పుడు కానీ ప్రొడ్యూసర్స్ కు తృప్తి ఉండదు. చూసే ఆడియన్స్ తృప్తి ఉండదు..నాకు తృప్తి ఉండదు. `` అన్నారు . ఈ మాటలు డైరక్ట్ గా `జైలర్` ని ప్రస్తావిస్తూ అనకపోయినా, ఆ సినిమాని ఉద్దేశించే చిరంజీవి ఈ కామెంట్స్ చేసారంటున్నారు. ఏదైమైనా చిరంజీవి కష్టం గురించి, అదీ వయస్సులో ఆయన చేసే డాన్స్,పైట్స్ కు మురిసిపోని అభిమాని ఉండరు.