సీనియర్‌ నటి ఆమని స్వల్ప అస్వస్థతకి గురయ్యారు. సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆమని అస్వస్థతకి గురి కావడంతో వెంటనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇప్పుడు ఆమె డిశ్చార్జ్ అయినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమని కామెడీ హీరో సంపూర్నేష్‌బాబు హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. 

మరోవైపు ఆమె మెయిన్‌ లీడ్‌లో నటిస్తున్న `అమ్మదీవెన` సినిమా నేడు(శుక్రవారం) విడుదల కానుంది. `సిసింద్రి`లో అఖిల్‌కి అమ్మ పాత్రలో నటించి పాపులర్‌ అయ్యింది ఆమని. నరేష్‌ హీరోగా రూపొందిన `జంబలకిడి పంబ` చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసిన ఆమని, బాపు `మిస్టర్‌ పెళ్లాం`, `శుభలగ్నం`, `శుభ సంకల్పం`, `ఘరానా బుల్లోడు`, `మాయాబజార్‌`, `ఆ నలుగురు`, `చందమామ కథలు` వంటి అనేక విజయవంతమైన సినిమాల్లో నటించారు.