ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది గోవా బ్యూటీ ఇలియానా. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈ భామకి బాలీవుడ్ లో ఛాన్స్ రావడంతో తన మకాం షిఫ్ట్ చేసింది. ఇక టాలీవుడ్ ని లైట్ తీసుకొని దక్షిణాది వైపు చూడడమే మానేసింది.

కొన్నాళ్ల పాటు ఆండ్రూ నీబోన్ అనే విదేశీ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేసింది. రీసెంట్ గా ఇద్దరికీ బ్రేకప్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మరోసారి తన కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టింది ఇలియానా. బాలీవుడ్ లో తనకి అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ వైపు చూస్తోంది.

చాలా కాలం తరువాత టాలీవుడ్ లో ఆమె నటించిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమా ఫ్లాప్ అయింది. సినిమాలో ఇలియానా లుక్స్ పై నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. అమ్మడు బాగా లావెక్కిందని.. బొద్దుగా తయారైందని సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.

అప్పట్లో తన సన్నని నాజూకు నడుముతో కుర్రకారుని షేక్ చేసిన ఇలియానా ఇప్పుడు లావైపోవడంతో ఆమెకి అవకాశాలు ఇవ్వడానికి కూడా దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారట.  దీంతో ఇలియానా బరువు తగ్గాలని నిర్ణయించుకుందట. వ్యాయామాలు, డైట్ ద్వారా బరువు తగ్గించుకోవాలని ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందట. మరి బరువు తగ్గి ఒకప్పటిలా తయారవుతుందేమో చూడాలి!