Asianet News TeluguAsianet News Telugu

‘నా శరీరంలో ఆ పార్ట్స్ నాకు కూడా నచ్చవు’ :ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానా మన తెలుగుని విడిచి చాలా కాలం అయినా మనవాళ్లు మర్చిపోవటం లేదు. ఎప్పుడూ తెలుగు మీడియాలో ఏదో ఒక వార్తలో ఆమె ఉంటోంది. ఆమె గురించి ఎక్కడ ఏ న్యూస్ వచ్చినా అది తెలుగులోకి వస్తోంది.  ‘దేవదాసు’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా ఉంది. అయితే ఆ మధ్యన రవితేజతో నటించిన అమర్ అక్బర్ అంథోని సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోయి ఫోటోలు పెట్టిన ఒక్క ఛాన్స్ కూడా రావడం లేదు. అయితే ఆ పెట్టే ఫొటోలను జనం బాగా ట్రోల్ చేస్తున్నారట. ఈ విషయం ఆమే చెప్తోంది. ఓ ఇంటర్వూలో ట్రోలింగ్ గురించి చెప్పుకొచ్చింది. 
 

Ileana dcruz about her body and many intresting facts jsp
Author
Hyderabad, First Published Mar 9, 2021, 7:16 PM IST

గోవా బ్యూటీ ఇలియానా మన తెలుగుని విడిచి చాలా కాలం అయినా మనవాళ్లు మర్చిపోవటం లేదు. ఎప్పుడూ తెలుగు మీడియాలో ఏదో ఒక వార్తలో ఆమె ఉంటోంది. ఆమె గురించి ఎక్కడ ఏ న్యూస్ వచ్చినా అది తెలుగులోకి వస్తోంది.  ‘దేవదాసు’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు తెరకు దూరంగా ఉంది. అయితే ఆ మధ్యన రవితేజతో నటించిన అమర్ అక్బర్ అంథోని సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోయి ఫోటోలు పెట్టిన ఒక్క ఛాన్స్ కూడా రావడం లేదు. అయితే ఆ పెట్టే ఫొటోలను జనం బాగా ట్రోల్ చేస్తున్నారట. ఈ విషయం ఆమే చెప్తోంది. ఓ ఇంటర్వూలో ట్రోలింగ్ గురించి చెప్పుకొచ్చింది. 

ఇలియానా మాట్లాడుతూ...తనలో కూడా బ్యూటీ స్పాట్స్ ఉన్నాయని కానీ వాటిని వదిలేసి మిగిలిన వాటిలో లోపాలను ఎత్తిచూపడం సరికాదు అంది. అదే సమయంలో తన శరీరంలో కొన్ని భాగాలు తనకు కూడా నచ్చవని తెలిపింది. చూడ్డానికి అంత పొడవుగా కనిపించనని, తాను నల్లగా కూడా ఉంటానని, అలాగే ఎదభాగంతోపాటు చేతులు సన్నగా ఉంటాయని ముక్కు పెదాలు కూడా సరిగా ఉండవని చెప్పింది ఇలియానా. ఈ విషయాలను తనను వేధిస్తుంటాయని, ఎవరైనా తన శరీరాకృతి గురించి చెప్పమంటే ఇబ్బంది పడతానని తెలిపింది. గతంలో ఆండ్రూ అనే వ్యక్తితో ఇలియానా ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీళ్లద్దరూ విడిగానే ఉంటున్నారు.

ఆ మధ్యన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చి సందడి చేసింది. ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ పేరిట నిర్వహించిన ఈ చాటింగ్‌లో పలు ఆసక్తికర విషయాలను పంచుకొందీ ముద్దుగుమ్మ. ‘మీ బాయ్‌ ఫ్రెండ్‌  పేరేంటి?’ అని ఓ నెటిజన్అ‌ డగ్గా తాను పెంచుకుంటున్న కుక్కను చూపించి వీడి పేరు ఛార్లీ అంటూ బదులిచ్చింది. ‘అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీ’, ‘ది బిగ్‌ బుల్‌’ చిత్రాలతో బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios