Ilayaraja: ఇళయరాజా బుధవారం ఉదయం మూకాంబిక దేవికి, వీరభద్రస్వామికి వజ్రాల కిరీటాలు, వీరభద్రస్వామికి బంగారు ఖడ్గం సమర్పించారు. వాటి విలువ ఎంతంటే?
ఇళయరాజా 8 కోట్ల కానుకలు
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజ వజ్రాల కిరీటం, వజ్రాల హారం, బంగారు ఖడ్గం మూకాంబిక టెంపుల్‌లో సమర్పించారు. కొల్లూరు మూకాంబిక దేవికి, వీరభద్రస్వామికి ఎనిమిది కోట్ల విలువ చేసే వజ్రాలతో చేసిన బంగారు ముఖరూపం, ఖడ్గం ఇళయరాజ సమర్పించారు. బుధవారం ఉదయం కొల్లూరు వచ్చిన ఇళయరాజ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్య అడిగ సమక్షంలో ఆభరణాలు కొల్లూరు టెంపుల్‌కి సమర్పించారు.
ఇక ఈ కార్యక్రమంలో కొడుకు, సంగీత దర్శకుడు కార్తీక్ రాజా కూడా ఇళయరాజతో ఉన్నారు. గత సంవత్సరం శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ టెంపుల్‌లోని గర్భగుడి ముందున్న అర్థ మండపంలోకి వెళ్లకుండా ఇళయరాజని టెంపుల్ అధికారులు ఆపారు. ఇళయరాజ ప్రార్థన కోసం అర్థ మండపంలోకి వెళ్లబోతుంటే టెంపుల్ అధికారులు, భక్తులు ఆపేశారు. ఈ క్రమంలో ఆయన దేవతా మూర్తులకు ఇంత విలువైన కానుకలు సమర్పించడం చర్చనీయాంశం అయ్యింది.
ఇళయరాజా వివాదాలు
ప్రస్తుతం ఇళయరాజా పలు రకాల వివాదాలకు కేంద్రం అయ్యారు. తన పాటలు అనుమతి లేకుండా వాడటంపై కొంత కాలంగా కొన్ని సినిమాలపై ఆయన లీగల్ నోటీసులు ఇస్తూ వస్తున్నారు. రీసెంట్ గా సౌత్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాపై ఇళయరాజా హైకోర్టులో కేసు వేశారు. తన పాటలను అనుమతి లేకుండా సినిమాలో వాడారని, కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. అయితే, పాటలకు సంబంధించిన అసలు హక్కుదారుల నుంచి అనుమతి తీసుకున్నామని గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా నిర్మాతలు చెబుతున్నారు. గతంలో తన ప్రాణ మిత్రుడు, దివంగత స్టార్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విషయంలో కూడా ఆయన ఇటువంటి చర్యలే తీసుకున్నారుే. అప్పట్లో ఈ విషయం బాగా వైరల్ అయ్యింది.
