Bhavatharini Raja : తెలుగు సినిమాలకూ.. ఇళయరాజా కూతురు చక్కటి సంగీతం, గాత్రం
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కూతురు భవతరణి తెలుగు సినిమాలకు కూడా పనిచేశారు. కేవలం ఆమె రెండు సినిమాలకే వర్క్ చేశారు. ఆమె చక్కటి గాత్రాన్ని, మ్యూజిక్ ను ఈ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు అందించింది.
మ్యాస్ట్రో ఇళయరాజా కూతురు కన్నుమూసింది. తమిళ సినీ ప్రముఖులు చింతిస్తున్నారు. ఆమె తెలుగు సినిమాలకూ వర్క్ చేశారు. కేవలం రెండు సినిమాలకు సంగీతం అందించారు. గత కొంతకాలంగా తను క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో పరిస్థితి విషమించింది. దీంతో శ్రీలంకలోని ఓ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించారు. కానీ ఆరోగ్యం విషమించి ఈరోజు రాత్రి ప్రాణాలు వదిలారు. ఆమె 47వ ఏటా కన్నుమూసింది.
ఇక భవతరణి కూడా కోలీవుడ్ లో చాలా సినిమాలకు వర్క్ చేశారు. సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ దాదాపు 30కి పైగా సినిమాలకు పనిచేశారు. ఆమె ఎక్కువగా తన తండ్రి మరియు సోదరుల దర్శకత్వంలో పాటలు పాడారు. ఇళయరాజా స్వరపరిచిన ‘భారతి’ చిత్రంలోని ‘మయిల్ పోలా పొన్ను ఒన్ను’ పాటను పాడినందుకు 2000లో ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా నేషనల్ అవార్డును అందుకున్నారు.
సంగీతంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న భవతరణి తెలుగు సినిమాలకు కూడా వర్క్ చేశారు. అయితే పెద్ద సంఖ్యలో పనిచేయలేదు. కేవలం రెండు సినిమాలకు మాత్రమే వర్క్ చేశారు. ఆదిపినిశెట్టి - తాప్సీ కలిసిన నటించిన చిత్రంలో ‘నన్ను నీతో’ అనే పాటను పాడింది. అలాగే ‘అవునా’ అనే మరో తెలుగు చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.