Asianet News TeluguAsianet News Telugu

Ilayaraja Daughter Death : విషాదం.. ఇళయరాజా కూతురు కన్నుమూత.. ఎలాగంటే?

మ్యాస్ట్రో ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతురు ఈరోజు తుదిశ్వాస విడిచింది. ఆమెకూడా కోలీవుడ్ లో గుర్తింపు పొందింది కావడంతో ప్రముఖులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. 

Ilayaraja Daughter Bhavatharini Raja Passed away NSK
Author
First Published Jan 25, 2024, 9:22 PM IST | Last Updated Jan 25, 2024, 9:22 PM IST

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కూతురు, సింగర్ భవతరణి రాజా Bhavatharini Raja ఈరోజు కన్నుమూశారు. ఉన్నట్టుండి ఆమె మరణవార్త తెలియడంతో ఇళయరాజా అభిమానులు చింతిస్తున్నారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. 

ఇక భవతరణి కూడా కోలీవుడ్ లో చాలా సినిమాలకు వర్క్ చేశారు. సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ దాదాపు 30కి పైగా సినిమాలకు పనిచేశారు. నాలుగేళ్ల కింద వరకూ యాక్టివ్ గానే కనిపించారు. ఈ ఏడాది ప్రారంభంలో తుదిశ్వాస విడిచారు. భవతరణి 47వ ఏటా కన్నుమూశారు. 

అయితే, భవతరణి మరణానికి కారణం ఉందని తెలుస్తోంది. గత కొంతకాలంగా తను క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో పరిస్థితి విషమించింది. దీంతో శ్రీలంకలోని ఓ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించారు. కానీ ఆరోగ్యం విషమించి ఈరోజు రాత్రి ప్రాణాలు వదిలారు. ఆమె మరణ వార్త విన్న తమిళ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.  

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios