చిరంజీవికు ఓ బిల్డింగ్ ని నేలమట్టం చేయాలనే కోరిక ఉందిట. ఇంతకీ ఏ బిల్డింగ్..అది ఎవరిదీ అంటే సమంతకు ఆయన చెప్పిన సమాధానం చూసి తెలుసుకోవాలి. తెలుగులో నెంబర్ వన్ గా ఎదుగుతున్న  ఓటీటీ  ‘ఆహా’లో సమంత యాంగర్ గా ప్రసారమయ్యే ‘సామ్‌జామ్‌’ పోగ్రామ్ లో చిరు గెస్ట్ గా పాల్గొన్నారు. అందులో భాగంగా చిరును సమంత ఓ ప్రశ్న అడిగితే ఆయన వెంటనే ఇలా సమాధానం చెప్పారు. ‘జీవితంలో వెనక్కి వెళ్లే అవకాశం వస్తే మీరు దేన్ని మార్చాలనుకుంటున్నారు..? అని ప్రశ్నించగా.. దానికి చిరు ఇంట్రస్టింగ్ గా సమాధానం చెప్పారు.

‘ఒకవేళ నిజంగానే ఆ అవకాశం వస్తే.. సరిగ్గా ఒక సంవత్సరం వెనక్కి వెళ్లి చైనాలో కరోనా వైరస్‌ లీక్‌ అయిన బిల్డింగ్‌ను భూస్థాపితం చేసి ఆ వైరస్‌ను బయటికి రాకుండా చేయాలనేది నా కోరిక’ అని మెగాస్టార్‌ చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి కార్యక్రమాన్ని ‘ఆహా’లో చూడవచ్చు. 

ఇక సామ్ జామ్ తొలి ఎపిసోడ్‌లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చారు. కానీ, ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దాంతో ‘సామ్ జామ్’ ఫ్లాప్ అంటూ విమర్శలు మొదయ్యాయి.దాంతో అల్లు అరవింద్.. చిరంజీవిని రంగంలోకి దించారని చెప్పుకుంటున్నారు. నిజానికి చిరంజీవి ఎపిసోడ్‌ను గ్రాండ్ ఫినాలేగా డిజైన్ చేశారట. కానీ, షోపై ప్రస్తుతం నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో దాన్ని మార్చడానికి ఇప్పుడు చిరంజీవి ఎపిసోడ్‌ను ముందుకు తీసుకొచ్చారని ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడెక్షన్‌ కంపెనీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన సినిమాలో ఓ కీలక పాత్ర కూడా పోషించనున్నారు. ఆ తర్వాత మెగాస్టార్‌ ‘లూసిఫర్‌‌’లో నటించనున్నారు.