Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లా కేసీఆర్ ఎందుకు చేయకూడదు?: కేటీఆర్

బాహుబలి ఆర్ఆర్ఆర్ పుష్ప కార్తికేయ 2 వంటి తెలుగు సినిమాలు పాన్-ఇండియా స్థాయిలో అత్యధిక వసూళ్లు రాబట్టగలిగితే తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు దేశానికి ప్రధానిగా కాకూడదు

If Jr NTR and Ram Charan can, Why not KCR?
Author
First Published Oct 27, 2022, 6:52 AM IST


మన తెలుగు హీరోలు చేసి నిరూపించిన పనిని తెలంగాణ సీఎం చేయలేడా?  అంటూ ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ఆయన రీసెంట్ గా ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ...మన హీరోలు ప్యాన్ ఇండియా లెవల్ లో సినిమాల్లో సత్తా చాటినప్పుడు మన కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాల్లో సత్తా చాటలేడా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా దూసుకుపోతోంది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు దేశవ్యాప్త రాజకీయ పరిణామాల నేపధ్యంలో తన పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై భారీ ఎత్తున అంతటా చర్చ,రచ్చ జరుగుతోంది. విమర్శలు వస్తున్నాయి. అయితే అంతే సమర్దవంతంగా కేటీఆర్,కేసీఆర్ తిప్పికొడుతున్నారు.

 ఇటీవల ఓ టీవీ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ ను...' కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని కలలుకంటున్నారా'అని ప్రశ్నించగా దానికి కేటీఆర్ ఆసక్తిగా బదులిచ్చాడు. "2023 ఎన్నికల తర్వాత కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారు. ఆయనే మొదటి వ్యక్తి అవుతారు. దక్షిణ భారతదేశంలో వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైంది కేసీఆర్ మాత్రమే అవుతారు.' అంటూ చెప్పుకొచ్చారు. "కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఒక ముఖ్యమంత్రి 15 ఏళ్లపాటు తన పదవిని కొనసాగించగలిగితే ప్రతి భారతీయుడు ఆ ముఖ్యమంత్రి వైపు చూస్తాడు” అని ఆయన అన్నారు.

అలాగే కెటిఆర్ మాట్లాడుతూ " కంటెంట్ ఉన్న తెలుగు సినిమాలు దేశం అంతటా దుమ్ము రేపుతున్నాయి కదా. బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప, కార్తికేయ2, ఇలాంటి ఎన్నో సినిమాలు కంటెంట్ ఉంటే భాషతో సంభందం లేకుండా సూపర్ హిట్ అవుతున్నాయి. ఆ హీరోలు ఎవరూ ... బేస్ మార్చి ముంబై వెళ్లిపోలేదు కదా. హైదరాబాద్ లో ఉంటూనే ఈ హీరోలంతా..ప్రభావవంతమైన పనులు చేయగలుగుతున్నారు కదా. మరి కేసీఆర్ ఎందుకు చేయకూడదు అదే పని, మా డీఎన్ ఏ  మారదు..అన్నారు.

బాహుబలి ఆర్ఆర్ఆర్ పుష్ప కార్తికేయ 2 వంటి తెలుగు సినిమాలు పాన్-ఇండియా స్థాయిలో అత్యధిక వసూళ్లు రాబట్టగలిగితే తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు దేశానికి ప్రధానిగా కాకూడదు అన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ చేయగలిగిన పని కేసీఆర్ ఎందుకు చేయకూడదు? అని కేటీఆర్ ప్రశ్నించారు.  'గుజరాత్కు చెందిన ఎవరైనా వచ్చి దేశాన్ని అస్తవ్యస్తంగా పరిపాలించగలిగితే సానుకూల మార్పు తీసుకురావడానికి తెలంగాణకు చెందిన వారు ఎందుకు ప్రధాని కాకూడదు' అని కూడా కేటీఆర్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios