సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇప్పటికే ఈ సినిమా నుండి 'ఛోటీ ఛోటీ బాతే', 'ఎవరెస్ట్ అంచున', 'నువ్వే సమస్తం', 'పాలా పిట్ట', 'పదరా.. పదరా', 'ఫిర్ సే' వంటి లిరికల్ సాంగ్స్ ని విడుదల చేశారు. తాజాగా 'ఇదే కదా నీ కథ' అంటూ సాగే మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం.

దీనికి 'ది సోల్ ఆఫ్ రిషి' అంటూ ట్యాగ్ లైన్ ఇచింది. శ్రీమణి రాసిన ఈ పాటను విజయ్ ప్రకాష్ పాడారు. ఇక సినిమా విషయానికొస్తే.. ఇటీవల విడుదలైన సినిమా ట్రైలర్ కి మూడు రోజుల్లో పది మిలియన్లకు దగ్గరగా వ్యూస్ రాబట్టింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమాస్ బ్యానర్లలో దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు ఈ చిత్రాన్ని భారీ బడ్జెత్‌ తో నిర్మిస్తున్నారు. 

Scroll to load tweet…