---సూర్య ప్రకాష్ జోశ్యుల

సుమంత్ నిలదొక్కుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. హీరోయిజం, మాస్ మసాలా అంశాలను ప్రక్కన పెట్టి విభిన్నంగా వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విషయం మనకు ‘మ‌ళ్లీ రావా’, ‘సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం’ , ‘ఇదం జ‌గ‌త్’కథల ఎంపికతో అర్దమవుతుంది. ‘మ‌ళ్లీ రావా’సినిమా సక్సెస్ అయ్యి మళ్ళీ సుమంత్ అనే హీరో ఒకడున్నాడు అని జనాలకు గుర్తు చేస్తే...ఆ తర్వాత వచ్చిన‘సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం’ సినిమా  వెనక్కి లాగే పోగ్రాం పెట్టుకుంది. దాంతో సుమంత్ హోప్స్ మొత్తం‘ఇదం జ‌గ‌త్’మీద పెట్టుకున్నాడు. అతని ఆశలను ఈ సినిమా నెరవేర్చిందా...అసలు ఇందులో విభిన్నమైన ఎలిమెంట్ ఏమిటి...చూడదగ్గ సినిమానేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

 

కథ ఇదే..

నిషిత్(సుమంత్) కు రాత్రిళ్లు నిద్ర పట్టని జబ్బుతో బాధపడుతున్న నిరుద్యోగి. దాంతో డాక్టర్ ని కలిస్తే..నువ్వు రాత్రిళ్లు పనిచేసే జాబ్ వెతుక్కోవటం బెస్ట్ అంటాడు. కానీ ఇతని రిక్వైర్మెంట్ కు తగిన జాబ్ ఎవరు ఇస్తాడు. అందుకే తనకు తనే ఓ ఉద్యోగం క్రియేట్ చేసుకుని డబ్బులు సంపాదించుకునే పనిలో పడతాడు. ఇంతకీ ఆ ఉద్యోగం ఏమిటీ అంటే ప్రీలాన్స్ రిపోర్టర్. నైట్ టైమ్ లో సిటీలో జ‌రిగే ప్ర‌మాదాల్ని కెమెరాతో రికార్డ్ చేసి, ఛాన‌ళ్ల‌కు అమ్ముకుని జీవ‌నోపాధి డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో విలువలు, మానవత్వం మరిచిపోయి కేవలం డబ్బే లక్ష్యంగా పనిచేస్తుంటాడు.

ఇలా నైట్ డ్యూటీలు చేస్తున్న అతనికి  మ‌హ‌తి (అంజుకురియ‌న్‌) ప‌రిచ‌యం అవుతుంది. తను చేస్తున్న పని ఏమిటో చెప్తే తనను దూరం పెడుతుదని, తానెవ‌రో, ఏం చేస్తాడో అన్న విష‌యాల్ని మ‌హ‌తి ద‌గ్గ‌ర దాచి, ఆమెతో ఫ్రెండ్షిప్  చేస్తుంటాడు నిశిత్.

అయితే ఓసారి రోడ్డుపై జ‌రిగిన ఓ మర్డర్ ని త‌న కెమెరాలో బంధిస్తాడు. ఆ ఫుటేజ్‌తో డ‌బ్బు సంపాదించాల‌నుకుంటాడు. అందులో కొంత భాగాన్ని మాత్రమే మీడియాకు అమ్ముతాడు. పోలీసులకు కూడా ఇవ్వడు. ఇంతకీ అతను స్పెషల్ ఇంట్రస్ట్ ఎందుకూ  అంటే... ఆరోజు రాత్రి చనిపోయిన వ్యక్తి మహతి (అంజు కురియన్) తండ్రి. ఆయన్ని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అనే కోణంలో సుమంత్ ఇన్వెస్ట్ గేషన్ చేస్తుంటాడు. 

ఈ క్రమంలో తనకు దొరికిన ప్రతి ఎవిడెన్స్ ని  మీడియాకు డబ్బుకు అమ్మేస్తుంటాడు. చివరకు అదే కేసు సుమంత్ మెడకు చుట్టుకుంటుంది. ఆమె తండ్రిని చంపినవాళ్లు  నిషిత్  తో పాటు అతడి ఫ్రెండ్ ఆనంద్ (సత్య)ను చంపాలని చూస్తారు. ఆ విష వలయం లోంచి  నిషిత్  ఎలా బయటపడ్డాడు?  మహతి ప్రేమను ఎలా దక్కించుకున్నాడనేది మిగతా కథ. 

 

ఎలా ఉంది..

పైన చెప్పుకున్నట్లు సుమంత్ కరెక్ట్ ట్రాక్ లోకే వచ్చాడు. తన పరిధిలు గుర్తించుకుని కాన్సెప్టు ఓరియెంటెడ్ కథలనే చేస్తున్నాడు. అయితే ఆ కథలని ఎగ్జిక్యూట్ చేసే డైరక్టర్స్ , స్క్రిప్టు విషయంలో తడబడుతున్నాడనిపిస్తోంది. ఎందుకంటే సుమంత్ లాంటి హీరోలకు ..ఫరవాలేదు..ఓకే సినిమా అంటే జనాలు వెళ్ళరు. అబ్బా..అదిరిపోయిందిరా అనే టాక్ వస్తేనే వర్కవుట్ అవుతుంది. అంటే తెర వెనక చెయ్యాల్సిన కసరత్తు ఎక్కువ. స్క్రిప్టు స్టేజీలోనే సూపర్ హిట్ కొట్టేలా ఉండాలి. కానీ సుబ్రమణ్యపురం, అదో జగత్ సినిమాలు రెండూ స్క్రిప్టు దశలతోనే నీరసంగా ఉన్నాయి. ఫస్టాఫ్, కాంప్లిక్ట్ పాయింట్ బాగానే ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నా...అసలు కథలోకి వెళ్లేసరికి తడబడి...పోతున్నాయి. దాంతో అవి సుమంత్ కెరీర్ కు ఏ మాత్రం ఉపయోగపడే పరిస్దితి ఉండటం లేదు.

 

హాలీవుడ్ కాపీ...

హాలీవుడ్ లో వచ్చిన Nightcrawler (2014)కు అనుకరణగా ఈ సినిమా రూపొందింది. తెలుగులో కొద్దిదా మార్చారు. కానీ ఆ మార్పులు సరిపోవు. అలాగే మన మీడియా వేరు. ఎక్కడో శవం చచ్చి పడి ఉంది అంటే...లక్షలు ఇచ్చేయండి అంటే ఇచ్చే పరిస్దితి ఉండదు.ఆ సిట్యువేషన్ మనకు ఇంకా రాలేదు. అప్పుడు ఇలాంటి కథలను ఎత్తుకున్నా ఓకే. మన మీడియాకు ఎక్సక్లూజివ్ అంటే ఏదన్నా పొలిటికల్ గా పెద్ద స్కామ్ బయిటపెట్టగలగాలి. అంతేకానీ ఓ చిన్న మర్డర్ సీన్ ని టీవి ఛానెల్స్ లక్షలు పోసి కొనుక్కుని దాన్ని సెన్సేషన్ చేసే పరిస్దితి లేదు. మన ఛానెల్స్ కు అలాంటి మర్డర్ సీన్స్ బ్రేకింగ్ న్యూస్ గా రోజుకు బోలెడు దొరుకుతాయి. 

 

మిగతా విభాగాలు..

ఈ సినిమాలో సుమంత్ గొప్పగా చేసాడు అనటానికి...అసలు చేసేటంత సీన్ ఉన్న పాత్ర కాదు.  హీరోయిన్ సోసోగా ఉంది.తేలిపోయింది. టెక్నికల్ గా..ట్రైలర్ లో ఉన్నట్లుగా కూడా సినిమా లేదు.  సుమంత్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ లిమిటేషన్స్ పెట్టినట్లు అర్దమైపోతోంది. మిగతా విభాగాలు గురించి పెద్దగా మాట్లాడుకునేది ఏమీలేవు. సినిమాకు తగ్గట్లే ఉన్నాయి.

 

ఫైనల్ థాట్..

సుమంత్ సినిమా కు పనిగట్టుకుని మరీ థియోటర్ కు వెళ్లి చూడాలంటే ఈ స్టఫ్ సరిపోదు

 

రేటింగ్: 1.5/5

ఎవరెవరు..

నటీనటులు: సుమంత్‌, అంజుకురియన్‌, సత్య, శివాజీరాజా తదితరులు

సంగీతం: శ్రీచరణ్‌ పాకాల

సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి

ఎడిటింగ్‌: గ్యారీ

నిర్మాత: జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ శ్రీకాంతం

బ్యానర్‌: విరాట్‌ ఫిల్మ్స్‌, శ్రీ విఘ్నేష్‌కార్తీక్‌ సినిమాస్‌

విడుదల: 28-12-2018