సంథింగ్ స్పెషల్ అంటూ.. ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపాడు.. అల్లు అర్జున్. నిన్న ఆయన చేసిన పోస్ట్ అందరిలో క్యూరియాసిటీని కలిగించింది. తాజాగా అసలు విషయం రివీల్ చేశాడు ఐకాన్ స్టార్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) టాలీవుడ్ క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో.. భారీ బడ్జెట్ తో.. తెరకెక్కుతోన్న సినిమా పుష్ప2(Pushpa 2) గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 1.. బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. పార్ట్-1 రిలీజ్ అయ్యి దాదాపు రెండేళ్లు పూర్తి అవ్వుతున్నాయి. ఈసినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇమేజ్ ను సాధించాడు అల్లు అర్జున్. ఈసినిమా బన్నీకి తిరుగు లేని క్రేజ్ తో పాటు.. ఎన్నో అవార్డ్స్ ను కూడా తెచ్చిపెట్టింది.
అంతే కాదు.. తాజాగా పుష్ప సినిమాలో నటనకు గాను జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డుని అందుకున్నారు. ఇదే సినిమాకు గాను..బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీప్రసాద్ నేషనల్ అవార్డ్ ను సాధించారు. ఇప్పటికే పుష్ప సీక్వెల్ మూవీపై భారీగా అంచనాలు ఉండగా.. ఈ అవార్డ్స్ రావడంతో.. ఆ అంచనాలు కాస్తా.. డబుల్ అయ్యాయి. దీంతో సీక్వెల్ పై మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఈ క్రేజ్ ని మూవీ టీం కూడా తమ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకోబోతున్నారు.
ఇక ఈక్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న(అగస్ట్ 29) సాయంత్రం తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ షేర్ చేశాడు. రేపు ఉదయం గంటలకు సంథింగ్ స్పెషల్ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు ఆ సంథింగ్ స్పెషల్ ఏంటని ఆశగా ఎదురు చూశారు. తాజాగా బన్నీ ఆ స్పెషల్ పోస్ట్ ని షేర్ చేశాడు. మార్నింగ్ తన డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి పుష్ప 2 సెట్స్ లో షూటింగ్, ఆ లొకేషన్స్.. ఆ వీడియోలో బన్నీ చూపించాడు. అయితే నేషనల్ అవార్డ్ వచ్చిన సందర్భంగా. ఇన్ స్టా గ్రామ్ కోసం బన్నీ ఈ వీడియోను చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్నట్టు తెలుస్తోంది. పుష్ప పార్ట్ 1ను మించిపోయేలా.. పార్ట్ 2ను తెరకెక్కిస్తున్నారు టీమ్. అంతే కాదు అంతకు మించి అన్నట్టుగా జోరు చూపిస్తున్నారు. పుష్ప2 ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈక్రమంలో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. పుష్ప1 మూవీ 500 కోట్ల వరకూ కలెక్ట్ చేయగా.. పుష్ప 2 ఎంత కలెక్ట్ చేస్తుందా అని ఆలోచనలో ఉన్నారు ఫ్యాన్స్.
