అల్లు అర్జున్‌ రెండేళ్ల క్రితం `ఐకాన్‌` చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. `ఎంసీఏ` వంటి విజయవంతమైన సినిమాని రూపొందించిన వేణు శ్రీరామ్‌ దీనికి దర్శకత్వం వహిస్తారని చెప్పారు. దిల్‌రాజు నిర్మించనున్నారు. అయితే బన్నీ `అలావైకుంఠపురములో` సినిమా షూటింగ్‌ టైమ్‌లో తన నెక్ట్స్ చిత్రాలను ప్రకటించారు. సుకుమార్‌తో ఓ సినిమాని ప్రకటించారు. ఆ తర్వాత కొరటాల శివతోనూ మరో సినిమాని అనౌన్స్ చేశాడు బన్నీ. దీంతో వేణు శ్రీరామ్‌ `ఐకాన్‌`పై సందిగ్దం నెలకొంది. 

`ఐకాన్‌` ఉండదనే కామెంట్లు వినిపించాయి. బన్నీ ఈ చిత్రాన్ని పక్కన పెట్టేశాడని వార్తలు చక్కర్లుకొట్టాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ని అంతా మర్చిపోయారు. కానీ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. `ఐకాన్‌` ఉంటుందా? లేదా? అనే దానిపై దర్శకుడు వేణు శ్రీరామ్‌ క్లారిటీ ఇచ్చారు. వేణు శ్రీరామ్‌ ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌తో `వకీల్‌సాబ్‌` సినిమాని రూపొందించారు. ఇది ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. 

ఇందులో భాగంగా వేణు శ్రీరామ్‌కి `ఐకాన్‌`కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. తాను అల్లు అర్జున్‌తో `ఐకాన్‌` సినిమా చేయాల్సి ఉందని చెప్పింది. మరిచిపోయిన ప్రాజెక్ట్ ఉందని చెప్పడంతో బన్నీ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం మొదలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం తర్వాత `ఐకాన్‌` ఉంటుందని సమాచారం. మరి అప్పటికైనా ఉంటుందా? లేక ఈ గ్యాప్‌లో లెక్కలు మారిపోతాయా? అన్నది చూడాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు.