Asianet News TeluguAsianet News Telugu

నిర్మాత SKN కు అల్లు అర్జున్ పరామర్శ, ఇంటికి వెళ్లిన ఐకాన్ స్టార్

చిన్న నిర్మాతగా పెద్ద విజయాలు సాధిస్తున్న ఎస్ కె ఎన్  ను పరామర్శించారు అల్లు అర్జున్. తాజాగా నిర్మాత ఇంట విషాదం జరగగా.. ఆయన్ను ఓదార్చారు ఐకాన్ స్టార్. 

Icon Star Allu Arjun Tributes To Producer Skn Father  Viral Photos JMS
Author
First Published Jan 23, 2024, 1:53 PM IST

అల్లు ఫ్యామిలీ నీడలో నిర్మాతగా ఎదిగాడు శ్రీనివాస్ కుమార్ అలియాస్ ఎస్ ఎన్ కె. సాధారణ రిపోర్టర్ గా లైఫ్ స్టార్ట్ చేసి.. ఆతరువాత పీఆర్ గా.. తరువాత బల్లు అర్జున్ పర్సనల్ అసిస్టెంట్గా.. డిస్ట్యూబ్యూటర్ గా.. తరువాత నిర్మాతగా మారి.. హిట్ సినిమాలను నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా అతను తన ఫ్రెండ్ కొత్త దర్శకుడు రాజేష్ తో కలిసి చేసిన బేబీ సినిమా సంచలన విజయం సాధించింది. 

అతని స్పీచ్ లతో కూడా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు. త్వరలో బాలీవుడ్ లో కూడా సినిమాలు తీయబోతున్నాడు. ఆల్రెడీ తన నిర్మాణ సంస్థ నుంచి మరో రెండు సినిమాలు ప్రకటించాడు.ఇక ఈ ఊపులో మరో సినిమాను ప్లాన్ చేశారు టీమ్. ఈలోపు నిర్మాత ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.  

 

రీసెంట్ గా SKN తండ్రి గాదె సూర్యప్రకాశరావు మరణించారు.  జనవరి 4 ఆయన మరణిచడంతో పలువురు టాలీవుడ్  సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించి SKNని పరామర్శించారు. తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు(జనవరి 23) ఉదయం SKN ఇంటికి వెళ్లి ఆయన తండ్రికి నివాళులు అర్పించి SKN ని, కుటుంబ సభ్యులని పరామర్శించారు. దీంతో SKN ఇంట్లో బన్నీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారాయి. 

బన్నీ పుష్ప సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. పుష్ప2ను పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లి.. ఆస్కార్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు టీమ్. అందుకే చాలా జాగ్రత్తగా ప్లాన్  చేసుకుని సినిమా చేస్తున్నారు టీమ్. టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్ ఈసినిమాను అద్భుతంగా డైరెక్ట్ చేస్తున్నారు. ఫైనల్ షూటింగ్ ఇంకా 20 శాతం మాత్రమే మిగిలి ఉందని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios