సింపుల్‌గా ఉండే స్టార్ హీరోలలో  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. స్టార్ హీరోని అనే ఫీలింగ్‌ లేకుండా.. చాలా సింపుల్ గా ఉంటారు బన్నీ. తనతో పాటు తన దగ్గర పని చేసే వారిని కూడా సొంత మనుషుల్లా చూసుకుంటాడు బన్నీ. ఈ విషయాన్ని మరోసారి నిరూపించాడు ఐకాన్ స్టార్.  

సింపుల్‌గా ఉండే స్టార్ హీరోలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. స్టార్ హీరోని అనే ఫీలింగ్‌ లేకుండా.. చాలా సింపుల్ గా ఉంటారు బన్నీ. తనతో పాటు తన దగ్గర పని చేసే వారిని కూడా సొంత మనుషుల్లా చూసుకుంటాడు బన్నీ. ఈ విషయాన్ని మరోసారి నిరూపించాడు ఐకాన్ స్టార్. 

సాదాసీదా ఉంటూ అందరితో కలిసిపోతూ.. సింపుల్ గా ఉండటంలో అల్లు అర్జున్‌ ను మిచింన వారు లేదు. తన చుట్టూ ఉండే వ్యక్తులతో ఎప్పుడూ స్టార్‌ హీరోలాగా ప్రవర్తించకుండా ఫ్రెండ్లీగా ఉంటారు బన్నీ. అంతే కాదు ఆయన దగ్గర పనిచేసే వ్యక్తులను కూడా చాలా క్లోజ్ గా చూసుకుంటారు బన్నీ. వారి బాగోగులు చూసుకోవడమే కాదు.. వారికి సంబంధించిన అకేషన్స్ కూడా తన ఇంటి కార్యక్రమాల్లా ఫీల్ అవుతారు స్టార్ హీరో.

తన మంచి తనాన్ని మరోసారి నిరూపించాడు అల్లు అర్జున్. తాజాగా ఈ ఐకాన్‌ హీరో.. తన కంటెంట్‌, డిజిటల్‌ హెడ్‌ అయిన శరత్‌ చంద్ర నాయుడు పుట్టిన రోజు వేడుకని ఘనంగా జరిపారు. డిజిటల్ హెడ్ పుట్టిన రోజు కావడంతో సడన్‌గా కేక్‌ తీసుకొచ్చి సర్ ప్రైజ్ ఇచ్చాడు. బర్త్‌డే సెలబ్రేట్‌ చేసి హడావిడి చేశాడు. సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్‌ అన్నీ ఆ కేక్ మీద హైలెట్ చేశారు. దీన్ని బట్టి తన టీమ్ ను ఆయన ఎంత స్పెషల్ గా చూసుకుంటారో మరోసారి నిరూపించారు. 

తన స్టాఫ్‌ బర్త్‌డే వేడుకలను సెలబ్రేట్‌ చేయడం బన్నీకి ఇది ఫస్ట్ టైమ్ కాదు. చాలా సార్లు చాలా మంది బర్త్‌డేలను సెలబ్రేట్‌ చేశారు. స్పెషల్‌ అకేషన్స్‌ అన్ని అలానే చేస్తుంటాడు. అంతే కాదు తన టీమ్ లో పనిచేస్తున్న చిన్నవాళ్ల పెళ్లిళ్లకు కూడా బన్నీ హాజరవుతుంటారు. వాళ్ళు కూడా అల్లు అర్జున్ ను చాలా ప్రేమగా చూసుకుంటారు. బన్నీ దొరకడం మా అదృష్టం అంటుంటారు. 

ఇక బన్నీ పుష్ప సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. పుష్పా పార్ట్ 2 షూటింగ్ కోసం రెడీ అవుతున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది. ఆ తర్వాత సంజయ్‌లీలా భన్సాలీతో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా బన్నీ సంజయ్ ను కలిసి వచ్చినట్టు తెలుస్తోంది. అంతే కాదు అల్లు అర్జున్ రాజమౌళి దర్శకత్వంలోనూ నటించబోతున్నట్లు రూమర్ వినిపిస్తోంది.