టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన అవకాశం లభించింది. ఇంటర్నేషనల్ స్థాయిలో బన్నీ ఖ్యాతి వెలగబోతోంది. అందుకోసం ఆయన తాజాగా జర్మనీ వెళ్ళారు. అక్కడ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనబోతున్నారు.  

టాలీవుడ లో స్టార్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సాధించి..ఐకాన్ స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేసిన షేర్.. ఈసినిమాతో అంతర్జాతీయ గుర్తింపు కూడా సాధించాడు. జాతీయ అవార్డ్ ను కూడా సొంతం చేసుకున్న బన్నీ.. పుష్ప సినిమాతో సామాన్యుల దగ్గర నుంచి స్టార్స్ అవరకూ.. అందరిని కదిలించాడు. పుష్ప మ్యానియాతో అంతూ ఊగిపోయారు.. పుష్పరాజ్ ను ఇమిటేట్ చేస్తూ.. ఇంటర్నేషనల్ స్టార్స్, క్రికెటర్స్ సెలబ్రిటీస్ కూడా రీల్స్ చేశారంటే.. ఈ ప్రభావం ఎంత పడిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక పుష్ప వల్ల తాజాగా మరో అరుదైన అవకాశాన్ని అందుకున్నారు అల్లు అర్జున్. 

పుష్ప సినిమాకు మరోఅంతర్జాతీయ గౌరవం దగ్గకబోతోంది. అది దగ్గరుండి చూడటానికి పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ జర్మనీ వెళ్ళారు. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌’ పాల్గొనేందుకు ఆయన నిన్న బెర్లిన్ బయలుదేరాడు. ఈ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ‘పుప్ప: ది రైజ్’ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. కాగా తన పర్యటనలో భాగంగా ఇంటర్నేషనల్ దర్శకులు, చిత్ర నిర్మాతలు, మార్కెట్‌లో సినిమా హక్కుల బయ్యర్స్ తో కూడా బన్నీ మాట్లాడనున్నాడు. ‘పుష్ప’ మూవీ స్క్రీనింగ్‌లో భాగంగా ఇంటర్నేషనల్ మీడియాతో ఐకాన్ స్టార్ మాట్లాడతాడు. 

Scroll to load tweet…

ఈసినిమాకు అంతర్జాతీయంగా కూడా భారీగా క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే.. ఇండియాలో మాత్రమే కాదు పుష్ప సినిమా రష్యా, అమెరికా, గల్ఫ్ దేశాలు, ఆస్ట్రేలియా, యూకేతో పాటు ఇతర దేశాల్లోనూ కూడా సూపర్ హిట్ అయ్యిందీ మూవీ. ఇక ఈ ఉత్సాహంతో పుష్ప2ను అంతకు మించి తెరకెక్కిస్తున్నారు టీమ్. ఈసినిమా కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నాడు. ఇక సినీమా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప-2: ది రూల్’ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీస్’ ఈ మధ్యే అధికారికంగా ప్రకటించింది. 

200 రోజుల్లో పుష్ప రాజ్ పాలన ఆరంభం అని ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ లెక్కల మాస్టారు.. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈసారి ఈ సినిమాతో ఆస్కార్ సాధించాలన్న పట్టదలతో ముందుకు వెళ్తున్నారుటీమ్.