అల్లు అర్జున్ సరికొత్త రికార్డ్.. ఇండియా నుంచి బన్నీ ఒక్కడే..
రికార్డ్ ల మీద రికార్డ్ లు సృష్టిస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అటు సినిమాలు ఇటు సోషల్ మీడియా ఎందులోను తగ్గేదే లేదు అంటున్నడు. కొత్త గా ఏ యాప్ లు వచ్చినా సరే అల్లు అర్జున్ దాటికి శేక్ అవ్వాల్సిందే.

పుష్ప స సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోమాడు అలమలు అర్జున్. ఈ విషయం అందరికి తెలిసిందే.. పాన్ ఇండియా ఇమేజ్ కు తగ్గట్టుగానే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఐకాన్ స్టార్ కు నార్త్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చిపడింది. ఒక్క సినిమాతో బాలీవుడ్ లో స్టార్స్ అందరిని పక్కాకు నెట్టేసి.. అల్లు అర్జున్ తన ఫాలోయింగ్ ను అమాతం పెంచుకున్నాడు. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య అమాతం పెరుగుతూనే ఉంది. తాజాగా ఇది మరోసారి నిరూపితం అయ్యింది.
సోషల్ మీడియాలో కూడా బన్నీకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మరీ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ఆయనకు 21.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ కూడా సాధించని రికార్డును బన్నీ సాధించాడు. ఈమధ్య మార్కెట్ లోకి కొత్త సోషల్ మీడియా యాప్ వచ్చింది.అది కూడా ట్విట్టర్ కు పోటీగా మార్క్ జుకర్ బర్గ్ 'థ్రెడ్స్'ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్ లో.. మన ఇండయన్ స్టార్స్ చాలా మంది అకౌంట్లు ఓపెన్ చేశారు. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. అయితే వీరంతా సాధించలేని రికార్డ్ ను అల్లు అర్జున్ సాధించాడే. థ్రెడ్స్ యాప్ లో అప్పుడే 1 మిలియన్ ఫాలోయర్స్ ను సొంతం చేసుకున్నాడు.
ఇండియాలో మరే సినీ స్టార్ కూడా ఈ ఘనతను సాధించలేదు. వన్ మిలియన్ ఫాలోయర్స్ ను సొంతం చేసుకున్న తొలి సినీ నటుడిగా బన్నీ రికార్డు సృష్టించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.