మాటల మాంత్రికుడితో మారో సారి అల్లు అర్జున్ సినిమా ..? బోయపాటికి హ్యాండిచ్చినట్టేనా..?
మరోసారి మాటల మాత్రికుడితో ఐకాన్ స్టార్ కాంబినేషన్ కలవబోతోందా..? హ్యాట్రిక్ హిట్ కొట్టిన ఈ కాంబో.. నాలుగో సినిమా కోసం రెడీ అవుతున్నారా..? బన్నీ బోయపాటికి హ్యాండిచ్చినట్టేనా...? ఈ వార్తలో నిజమెంత..?
ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవరి సినిమాల్లో వారు ఫుల్ బిజీగా ఉన్నారు. బన్నీని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా కోసం రెడీ అవుతున్నాడు. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ నెలలోనే మొదలుకానుంది. ఈ సినిమా తరువాత బన్నీతో చేయడానికి బోయాపాటి శ్రీనుతో సహా వరుసగా దర్శకులు లైన్లో ఉన్నారు. కానీ బన్నీ మాత్రం ముందుగా త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలనే ప్లాన్ తో ఉన్నాడని టాక్.
అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ఆల్రెడీ ఓ మాటను త్రివిక్రమ్ చెవిన వేశాడనట కూడా బన్నీ. మొదటి నుంచి కూడా త్రివిక్రమ్ తో చేయడానికి ఐకాన్ స్టార్ ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నాడు. గతంలో మూడు సినిమాలో హ్యాట్రిక్ కొట్టింది ఈ కాంబినేషన్. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి , అల వైకుంఠపురములో సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఈహ్యాట్రిక్ విన్నింగ్ జోష్ లోనే మరో సినిమాను చేయాలని అనుకుంటున్నాడట బన్నీ.
అందువలన ఇప్పుడు మరోసారి త్రివిక్రమ్ తో చేయడానికి బన్నీ ఆసక్తిని కనబరుస్తున్నాడట. అయితే త్రివిక్రమ్ మాత్రం చాలా కాలం నుంచి మహేష్ సినిమా మీద వర్క్ చేస్తున్నాడు. షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. SSMB28వర్కిగ్ టైటిత్ తో తెరకెక్కుతోన్న ఈమూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగు పూర్తయ్యేనాటికి, బన్నీ పుష్ప 2 కూడా పూర్తవుతుంది. ఈలోపు త్రివిక్రమ్ మంచి కథను రెడీ చేస్తాడట. ఆ వెంటనే సెట్స్ పైకి వెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారని టాలీవుడ్ లో టాక్. తివిక్రమ్ తో సినిమా చేసిన తరువాతే బన్నీ బోయపాటితో సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది.