హరీష్ శంకర్ తో అల్లు అర్జున్ అఫీషియల్... కాని ట్విస్ట్ ఏంటంటే..?

హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. అంతే కాదు స్టార్ డైరెక్టర్ కూడా కన్ ఫార్మ్ చేసిన న్యూస్.. కాని ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. 

Icon Star Allu Arjun Doing ad Film with Harish Shankar Direction JMS

పుష్ప2 కోసం తెగ కష్టపడుతున్నారు అల్లు అర్జున్ టీమ్. అంతా సిన్సియర్ గా పనిచేస్తున్నారు. పుష్పసీక్వెల్ తో... గ్లోబల్ ఇమేజ్ కొట్టేయాలని ప్లాన్ లో ఉన్నారు. ఈక్రమంలో ఎప్పటికప్పుడుసినిమాపై అంచనాలు పెంచేస్తూ ఉన్నారు. ఈక్రమంలో బన్నీ కూడా నెక్ట్స్ సినిమాల గురించి ఆలోచించకుండా.. కాన్సంట్రేషన్ అంతా పుష్ప సీక్వెల్ మీదే పెట్టాడు. నెక్ట్ సందీప్ రెడ్డితో సినిమా కమిట్ అయినా... ఆమూవీ సంగతి తరువాత చూద్దాం అంటూ.. పుష్ప బిజీలో ఉన్నాడు. ఈక్రమంలోనే ఓ న్యూస్ బన్నీ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. హరీష్ శంకర్ తో అల్లు అర్జున్. 

ఇంత బిజీగా ఉన్న అల్లు అర్జున్. ఈపరిస్థితుల్లో హరీష్ శంకర్ తో సినిమా చేస్తాడా..? అని డౌట్ రావచ్చు. కాని ఆయన చేయబోయేది మాత్రం సినిమా కాదు. ఇప్పటికే హరీష్ శంకర్ పవన్ కళ్యాన్ సినిమా ప్రకటించి.. కాస్త షూటింగ్ కూడా కంప్లీట్ చేసి.. ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ తరచూ వాయిదా పడుతోంది ఇలా ఈ సినిమా ఆలస్యం కావడంతో హరీష్ శంకర్ మరే ఇతర సినిమాలను కూడా ప్రకటించలేదు.  దాదాపు మూడేళ్లుగా హరీష్ ఇలా ఇబ్బందిపడుతూనే ఉన్నాడు.  వేరే సినిమాలకు కమిట్ అవ్వకుండా పవన్ కోసం ఎదరు చూస్తున్నాడు. 

 

ఈక్రమంలో హరీష్ కొన్నియాడ్ ఫిల్మ్స్ చేస్తూ.. టైమ్ పాస్ చేస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోలతో యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. ఈక్రమంలోనే.. అల్లు అర్జున్ తో యాడ్ ఫిల్మ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హరీష్ శంకర్ పలువురు స్టార్ హీరోల యాడ్స్ షూట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్ తో యాడ్ ఫిల్మ్  చేయడానికి కమిట్ అయ్యారని తెలుస్తోంది. అయితే ఈ యాడ్ కి సంబంధించినటువంటి షూటింగ్ హరీష్ శంకర్ డైరెక్షన్లో జరిగింది. ప్రస్తుతం ఈ షూటింగ్ కి సంబంధించినటువంటి ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయింది.

నాగార్జున, బాలయ్య, విశ్వక్ సేన్ ఇప్పుడు మనోజ్ వెండితెరపై హీరోలు, బుల్లితెరపై హోస్ట్ లు, సత్తా చాటిన స్టార్స్

ఇక ఈ ఫోటోని స్వయంగా డైరెక్టర్ హరీష్ శంకర్ తన సోషల్ మీడియా పేజ్ లో  షేర్ చేయడంతో విషయం తెలిసింది. ఆయన పోస్ట్ లో ఏముందంటే..? హరీష్ శంకర్ డైరెక్టర్ సీట్లో కూర్చొని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ అన్నపూర్ణ స్టూడియోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో యాడ్ షూటింగ్ జరిగిందని చెప్పకు వచ్చారు. ప్రస్తుతం ఈ యాడ్ షూటింగ్ కి సంబంధించినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఇప్పటికే బన్నీచాలా యాడ్ ఫిల్మ్స్ చేశారు. సినిమాలతో పాటు కొన్ని బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఉండటంతో.. కొన్ని కోట్లు సంపాదించుకుంటున్నారు స్టార్స్. అందులో అల్లు అర్జున్ కూడా ముందు వరుసలో ఉన్నాడు. ఇక సుకుమార్ డైరెక్షన్ ఐకాన్ స్టార్ నటిస్తోన్న పుష్ప సీక్వెల్ మూవీ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటుంది. నెక్ట్స్ ఇయర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios