మెగాస్టార్ చిరంజీవిపై ఐఏఎస్ అధికారి ఒకరు పరోక్షంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల ప్రియదర్శి తన అభిమాన నటుడైన మెగాస్టార్ చిరంజీవితో కలిసి తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫోటోకి 'సదా మీ ఏకలవ్య శిష్యుడిని' అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ ఫోటో చూసిన పరికిపండ్ల నరహరి అనే ఐఏఎస్ అధికారి కామెంట్ చేశారు. ''బ్రదర్ ప్రియదర్శి.. నేను చిరంజీవి రుద్రవీణ సినిమా చూసి ఐఏఎస్ అధికారి కావాలనుకున్నాను. మీరు కూడా మంచి యాక్టర్ అని 'మల్లేశం' సినిమాతో నిరూపించుకున్నారు. శుభాభినందనలు. కానీ చిరంజీవిని పొగడకుండా సినీ పరిశ్రమలో ఉండటం కష్టమా బ్రదర్?'' అని ప్రశ్నించారు.

దీనికి ప్రియదర్శి.. ''థాంక్యూ సర్. చిరంజీవి సర్ ఎంచుకునే కథలకు ఓ విలువ ఉంటుంది. అవి మా జీవితాలను ప్రభావితం చేస్తాయి' అని చెప్పాడు. చిరంజీవిపై ఓ ఐఏఎస్  అధికారి ఇలాంటి కామెంట్ చేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

మెగాస్టార్ ఎందరికో స్ఫూర్తిదాయకమని, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే చిరుని పొగడాల్సిందేనా..? అనే ఆలోచన మార్చుకోవాలని ఐఏఎస్ అధికారికి చీవాట్లు పెడుతున్నారు.