Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్‌తో సినిమాపై `ప్రేమిస్తే` భరత్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌.. తెలుగులో నటించకపోవడానికి కారణమేంటంటే?

`బాయ్స్`, `ప్రేమిస్తే`, `యువసేన` వంటి చిత్రాలతో తెలుగులో మార్కెట్‌ ఏర్పడినప్పటికీ తెలుగులో సినిమాలు చేయకపోవడంపై `ప్రేమిస్తే` భరత్‌ ఓపెన్‌ అయ్యారు. ఆసక్తికర సమాధానం చెప్పారు.

i want do film with allu arjun premisthe bharath interesting comments on he not done telugu movies
Author
First Published Jan 19, 2023, 6:54 PM IST

`ప్రేమిస్తే` చిత్రంతో అటు తమిళంలోనే కాదు, తెలుగులోనూ ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు హీరో భరత్‌. ఇందులో అతని నటన వాహ్‌ అనిపిస్తుంది. శంకర్‌ దర్శకత్వంలో చేసిన `బాయ్స్` చిత్రంతో పాపులర్‌ అయిన భరత్.. తెలుగులో `యువసేన` చిత్రంలో నటించారు. చాలా గ్యాప్‌తో మహేష్‌బాబు `స్పైడర్‌`లోనూ కీలక పాత్రలో మెప్పించారు. హీరోగానే కాదు, నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలు, కీలక పాత్రల్లోనూ మెరుస్తూ రాణిస్తున్నారు. తమిళం, మలయాళంలో హీరోగా బిజీగా ఉన్న భరత్‌ తాజాగా చాలా గ్యాప్‌తో తెలుగులో సుధీర్‌బాబు హీరోగా రూపొందిన `హంట్‌` చిత్రంలో కీలక పాత్ర పోషించారు. శ్రీకాంత్‌, సుధీర్‌లతో కలిసి నటించారు. మహేష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనంద్‌ ప్రసాద్  నిర్మించారు. ఈ చిత్రం గణతంత్ర దినోత్సవ కానుకగా ఈ నెల 26న విడుదల కానుంది. 

చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తెలుగు మీడియాతో ముచ్చటించాడు భరత్‌. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. `బాయ్స్`, `ప్రేమిస్తే`, `యువసేన` వంటి చిత్రాలతో తెలుగులో మార్కెట్‌ ఏర్పడినప్పటికీ తెలుగులో సినిమాలు చేయకపోవడంపై ఆయన మాట్లాడుతూ, తాను తమిళంలో, మలయాళంలో హీరోగా బిజీగా ఉన్నాను, దీంతో తెలుగులో చేయాలనే ఆలోచన రాలేదని చెప్పారు. అక్కడ వరుసగా ఆఫర్లు వచ్చాయని చేసుకుంటూ వస్తున్నానని తెలిపారు. అయితే హీరోగా తెలుగు నుంచి ఆఫర్లు కూడా రాలేదన్నారు.

`స్పైడర్‌`లో ఆయన కీలక పాత్రలో నటించిన నేపథ్యంలో టాలీవుడ్‌ నుంచి ఆ తర్వాత కీ రోల్స్ కోసం ఆఫర్లు వచ్చాయని కానీ తనకు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. అందుకే తెలుగులో గ్యాప్‌ వచ్చిందన్నారు. చాలా రోజుల తర్వాత మంచి స్క్రిప్ట్, ఎగ్జైట్‌ చేసే పాత్ర రావడంతో `హంట్‌` చిత్రంలో నటించానని పేర్కొన్నారు భరత్‌. సుధీర్ బాబు తనకు  మంచి ఫ్రెండ్. సీసీఎల్ లో ఇద్దరం కలిసి క్రికెట్ మ్యాచులు కూడా ఆడేవాళ్లమన్నారు. శ్రీకాంత్ గారు కూడా సీసీఎల్ వల్ల కాస్త క్లోజ్. దీనికి అవన్నీ సెట్‌ అయ్యాయన్నారు. 

`హంట్‌` సినిమా గురించి చెబుతూ, `కథ మా ముగ్గురి (భరత్, శ్రీకాంత్, సుధీర్ బాబు) చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఆర్యన్ దేవ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ గా నటించా. నేను తమిళంలో పోలీసుగా నటించిన `కాళిదాసు` మూవీ నచ్చి డైరెక్టర్ మహేష్ ఈ రోల్ ఇచ్చాడు. 'హంట్'లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్, ఫ్రెండ్ షిప్ అన్నీ ఉంటాయి. ఈ సినిమా తెలుగులోనూ నా మార్కెట్ కి హెల్ప్ అవుతుందన్న నమ్మకం ఉంది` అని చెప్పారు భరత్‌. భవ్య క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రిచ్‌గా తెరకెక్కించిందని, నిర్మాణ విలువలు బాగున్నాయన్నారు. 

తెలుగు ఇండస్ట్రీ గురించి చెబుతూ, తెలుగు పరిశ్రమ ఈ ఐదేళ్లలో చాలా మారిపోయిందని, వినూత్నమైన సినిమాలు వస్తున్నాయని, ఇండియన్‌ సినిమాని ప్రతిబింబించేలా రూపుదిద్దుకుందని, చాలా మార్పు వచ్చిందన్నారు. భారీ చిత్రాలు ఇక్కడ రూపొందుతున్నట్టు చెప్పారు. అలాగే సౌత్‌ సినిమాలే ఇటీవల ఇండియా వైడ్‌గా సత్తా చాటుతున్నాయని, `బాహుబలి`, `ఆర్‌ఆర్‌ఆర్‌`, `పుష్ప`తోపాటు కన్నడ నుంచి `కేజీఎఫ్‌`, `కాంతార`, వంటి చిత్రాలున్నాయని పేర్కొన్నారు. డ్రీమ్‌ రోల్స్ గురించి చెబుతూ,  నాకు పూర్తి స్థాయిలో ఓ కామెడీ మూవీలో నటించాలనుంది. నేను ఇప్పటివరకూ అలాంటి పాత్ర చేయలేదు. అలాగే ఒక కంప్లీట్ రా ఏజెంట్ గా కూడా నటించాలనుంది. అలాంటి కథలొస్తే కచ్చితంగా చేస్తానని తెలిపారు భరత్. 

ఇక తెలుగులో రాజమౌళి, సుకుమార్‌, త్రివిక్రమ్‌ వంటి వారి దర్శకత్వంలో పనిచేయాలని ఉందన్నారు భరత్‌. మరోవైపు నటుడిగా అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని ఉందన్నారు. `గంగోత్రి` నుంచి బన్నీని చూస్తున్నానని, ఆల్మోస్ట్ ఇద్దరి కెరీర్‌ ఒకేసారి ప్రారంభమైందని, ఆయన మంచి స్థాయికి ఎదిగారని తెలిపారు భరత్‌. నటుడిగా అల్లు అర్జున్‌ అంటే ఇష్టమన్నారు హీరో భరత్‌. 

Follow Us:
Download App:
  • android
  • ios