గంజాయి అలవాటు ఉన్నవాళ్లు ఆ విషయం బయిట పెట్టడానికి ఇష్టపడరు. అయితే ప్రముఖ దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ మాత్రం ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించారు. ఒకప్పుడు తాను కూడా గంజాయికి అలవాటు పడిన వాడినేనని చెప్పారు. ఓ తమిళ చిత్రం ఆడియో ఫంక్షన్ కు గెస్ట్ గా  వచ్చిన ఆయన తనలాగా ఎవరూ గంజాయి కు అలవాటు పడద్దని అన్నారు. అయితే ఈ విషయం  విన్నవారు భాగ్యరాజా కు గంజాయ్ అలవాటు ఉండటం ఏమిటని షాక్ అవుతున్నారు.

భాగ్యరాజా మాట్లాడుతూ...ఒకసారి తన అసెస్టెంట్ ఒకరు కోయంబత్తూర్‌లో గంజాయితో కూడిన సిగరెట్‌ను ఇచ్చాడన్నారు. తాను వద్దాన్నా వినకుండా కాల్చేలా చేశాడని, మొదట్లో అది బాగానే ఉందనిపిస్తుందని ఆ తరువాత దాని ప్రభావం చూపిస్తుందని చెప్పారు. గంజాయి తీసుకుంటే ఎందుకో కారణం తెలియకుండానే నవ్వేస్తుంటామని చెప్పారు.

అలా గంజాయికి అలవాటు పడిన తాను ఒక సమయంలో ఏదేదో సాధించాలని వచ్చి ఇలా అయిపోయానేంటి? అన్న ఆలోచన రావడంతో ఎంతో కష్టపడి ఆ అలవాటు మానుకున్నానని తెలిపారు. ప్రస్తుతం సిగరెట్‌ తాగడం కూడా మానేశానని చెప్పారు.  ఎనర్జీ అనేది వయసును బట్టి కాకుండా మనసును బట్టి ఉంటుందన్నారు.  గంజాయి వంటి అలవాటు వలన కొత్తగా ఎనర్జీ ఏమీ జనరేట్ కాదన్నారు.