Asianet News TeluguAsianet News Telugu

ఆయన నెంబర్ ని 'గాడ్ ఫాదర్' అని సేవ్ చేసుకున్నా,వైయస్ జగన్ కు ధాంక్స్: అఖిల్‌

బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో  అఖిల్ నటించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా అక్టోబరు 15న విడుదలకానుంది. 

I Saved His Number As God Father: Akhil Akkineni
Author
Hyderabad, First Published Oct 15, 2021, 7:08 AM IST

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే  జంట‌గా తెరకెక్కిన సినిమా  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బ‌న్నీవాసు, వాసువ‌ర్మ నిర్మించారు. శుక్ర‌వారంనాడు విడుల‌కానున్న సంద‌ర్భంగా అఖిల్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం రివీల్ చేసారు. నాకు అరవింద్ గారు గాడ్ ఫాదర్, ఆయనతో చేయడం వలన  చాలా ఎక్స్పీరియన్స్ తో పాటు అన్ని వచ్చాయి. ఇప్పుడు నేను నా సెల్ లో అరవింద్ గారు గాడ్ ఫాధర్ అని సేవ్ చేసుకున్నాను. ఆయన, బన్నివాసు గారు నన్ను ఫ్యామిలీ మెంబర్ గా చూసు కున్నారు వారితో నా జర్నీ చాలా బాగుంది నన్ను ఎంతో కేర్ తీసుకొని చేశారు,నాకు హిట్ ఇవ్వటానికి వాళ్లు చాలా కృషి చేసారు. భవిష్యత్ లో మరోసారి గీతా ఆర్ట్స్ లో నేను సినిమా చేస్తాను. అందరికీ ధన్యవాదాలు అన్నారు.

అలాగే... నేను విజయవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకోవడానికి వెళ్ళాము, కరెక్ట్ గుడి బయట ఉన్నప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది మా సినిమాకు ఏపి లో 100% ఆక్యుపెన్సీ లభించిందని మాకు అమ్మవారే బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు అనిపించింది. మాకు 100% ఆక్యుపెన్సీ ఇచ్చిన ఏపీ గవర్నమెంట్ కి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి థాంక్యూ వెరీమచ్.గవర్నమెంట్ ఇచ్చిన ప్రికాషన్  అందరూ సేఫ్ గా పాటిస్తూ వచ్చి మా సినిమాను విజయవంతం చేయాలని కోరుతున్నాం అని చెప్పారు.

also read: పవన్‌ కళ్యాణ్‌తో మంచు మనోజ్‌ భేటీ.. ఆసక్తిరేకెత్తిస్తున్న కొత్త పరిణామాలు.. రాజీ ప్రయత్నమా?

సినిమా గురించి చెప్తూ..ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ కు, సెకండ్ ఆఫ్ కు ఒక జర్నీ ఉంది హర్ష అనే క్యారెక్టర్ కి నార్త్ నుండి సౌత్ కు జర్నీ చేసినట్టు ఉంటుంది. సినిమాలో వన్ టు ఇయర్స్ టైం గ్యాప్ కూడా ఉంటుంది. కమర్షియల్‌ ఫార్ములా అనే సేఫ్‌ జోన్‌ నుంచి బయటికొచ్చి నిజాయతీగా నటించిన చిత్రమిది. తెరపై నేను కాదు నా పాత్ర మాత్రమే కనిపించాలనుకున్నా. అందుకు తగ్గట్టు నన్ను నేను మలచుకున్నా. నేను హర్ష అనే పాత్రలో కనిపిస్తా. ఓ దశలో అల్లరి చేసే యువకుడిగా, కొన్ని సన్నివేశాల్లో మెచ్యూరిటీ ఉన్న వ్యక్తిగా రెండు విభిన్న కోణాలు ఆవిష్కరించా. బాయ్‌ నుంచి మ్యాన్‌గా మారే క్రమంలో హర్ష ఏం నేర్చుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది.

నిర్మాత అరవింద్‌గారు ఓ లవ్‌స్టోరీ చేయాలన్నప్పుడు ‘అబ్బా! ఇంకో లవ్‌స్టోరీనా’ అని ఫీలయ్యా. ప్రేమ కథంటే గొప్పగా ఏముంటుంది? రొటీనే కదా అని అనుకుంటూనే ఆయన ఆఫీసుకి వెళ్లా. అక్కడ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ కథ వినిపించారు. ప్రేమ, పెళ్లి విషయంలో మనం ఎదుర్కొనే సమస్యలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఆయన చెప్పిన విధానం నన్ను ఆకట్టుకుంది. ప్రేమకథే అయినా చాలా కొత్తగా అనిపించింది. ఒకనొకరు తాకడం ఒక్కటే రొమాన్స్‌ కాదని ఈ చిత్రంలో చూపించాం. ప్రేయసికి లేఖ రాయడం రొమాన్సే, పువ్వు ఇవ్వడమూ రొమాన్సే. ఇలాంటి ఎన్నో విషయాల్ని భాస్కర్‌గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios