టాలీవుడ్‌ హ్యాండ్సమ్ హీరో అక్కినేని అఖిల్ హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు ఇంకా కష్టపడుతున్నా.. ఫాలోయింగ్ పరంగా మాత్రం ఏ రేంజ్‌ క్రేజ్ సంపాదించుకున్నాడు. ముక్యంగా అమ్మాయిలు అఖిల్ అందానికి ఫిదా అయిపోయారు. ఈ లిస్ట్‌లో ప్రముఖులు కూడా ఉండటం విశేషం. తాజాగా ఓ టెలివిజన్ షోలో ఇదే విషయం ప్రస్థావనకు వచ్చింది. యంగ్ యాంకర్‌ విష్ణు ప్రియకు సంబంధించిన ఓ సీక్రెట్‌ను షోలో బయట పెట్టింది స్టార్ యాంకర్ శ్రీముఖి.

స్టా మా చానల్‌లో ఇటీవల ప్రారంభమైన సెలబ్రిటీ షో లవ్యూ జిందగీ. ఝాన్సీ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ షోలో శ్రీముఖి, విష్ణు ప్రియలు పాల్గొన్నారు. షోలో భాగంగా తమ పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఓ సీక్రెట్ రివీల్ చేయాలని యాంకర్‌ ఝాన్సీ కోరగా శ్రీముఖి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. విష్ణు ప్రియాకు సంబంధించి తన దగ్గర చాలా సీక్రెట్స్‌ ఉన్నాయని చెప్పటం, మచ్చుకు ఒక్కటి రివీల్ చేయాలని ఝాన్సీ కోరింది.

ఈ సందర్భంగా `ఓ వ్యక్తి విష్ణు ప్రియ లైఫ్‌లో చాలా స్పెషల్. దేవుడు ప్రత్యక్షమై ఏదైనా కోరిక కోరమని అడిగితే ఖచ్చితంగా అఖిల్ అక్కినేనితో పెళ్లి కావాలని అడుగుతుంది. నేను బిగ్ బాస్‌ సమయంలో నాగార్జున గారికి విష్ణు ప్రియ గురించి చెబుతాం అనుకున్నా కానీ కుదరలేదు. ఆమెకు అఖిల్‌ అంటే పిచ్చి, కావాలంటే ఆమె చేతి మీద టాటూ చూడండి` అంటూ విష్ణు ప్రియాకు సంబంధించిన సీక్రెట్ రివీల్ చేసింది శ్రీముఖి.