రవితేజ ప్లేస్‌లో తమ్ముడు పవన్‌ని ఊహించుకున్నా.. అందుకే గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు.. చిరంజీవి ఎమోషనల్
రవితేజని చూస్తుంటే తమ్ముడు పవన్ కళ్యాణ్‌ని చూస్తున్నట్టే ఉంటుందని, అప్పట్లో ఇద్దరూ ఒకేలా ఉండేవారని తెలిపారు చిరంజీవి. రవిలో నా తమ్ముడిని చూసుకున్నానని తెలిపారు. `వాల్తేర్ వీరయ్య` సక్సెస్ సెలబ్రేషన్‌లో ఆయన మాట్లాడారు.

చిరంజీవి హీరోగా నటించిన `వాల్తేర్ వీరయ్య` సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో తాజాగా శనివారం సాయంత్రం హన్మకొండలో `వాల్తేర్ వీరయ్య` విజయ విహారం పేరుతో సక్సెస్ సెలబ్రేషన్ ఏర్పాటు చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓ అతిథిగా ఇందులో సందడి చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రవితేజ గురించి ఆయన మాట్లాడారు.
నటీనటుల విషయానికి వస్తే మొదట రవితేజ గురించి మాట్లాడాలని, రవితేజని చూస్తుంటే తమ్ముడు పవన్ కళ్యాణ్‌ని చూస్తున్నట్టే ఉంటుందని, అప్పట్లో ఇద్దరూ ఒకేలా ఉండేవారని తెలిపారు. రవిలో నా తమ్ముడిని చూసుకున్నానని తెలిపారు. ముఖ్యంగా సినిమాలో రవితేజ పాత్ర చనిపోయినప్పుడు చాలా ఎమోషనల్‌గా అనిపించిందన్నారు. ఆ టైమ్‌లో రవితేజ స్థానంలో తమ్ముడు పవన్ కళ్యాణ్‌ని ఊహించుకున్నానని, అందుకే ఆటోమెటిక్ గా తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. గ్లిజరిన్ వాడకుండానే ఆ సీన్ చేయగలిగానని తెలిపారు. దీనిపై తనకు దర్శకుడు, నిర్మాతలు, ఇతర టీమ్ నుంచి మంచి అప్రిషియేషన్స్ వచ్చాయని చెప్పారు.
ఇక `వాల్తేర్ వీరయ్య` సినిమా పెద్ద హిట్ అవుతుందని ఊహించామని, కానీ ఇదొక నాన్ `బాహుబలి`, నాన్ `ఆర్‌ఆర్‌ఆర్` అవుతుందనుకోలేదన్నారు. అందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రం సుమారు రూ.250కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టిందని, ఇలాంటి సినిమా తనకు అందించినందుకు దర్శకుడు బాబీ, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి. దర్శకుడు బాబీ ఎంతో డెడికేషన్‌తో, కష్టపడి సినిమా చేశాడని, అతని పనికి నేనే అభిమాని అయిపోయానని చెప్పారు. అంతేకాదు తనకు `ఖైదీ` చిత్ర విజయం ఎలాంటి స్టార్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టిందో, ఇప్పుడు `వాల్తేర్ వీరయ్య` బాబీకి స్టార్ డైరెక్టర్‌ని చేసిందన్నారు చిరు.
ఈ సినిమాలో అభిమానులు తనని పాత చిరంజీవిని చూసుకుంటున్నారని, ఓ `గ్యాంగ్ లీడర్`, ఓ `ఘరానా మొగుడు`, ఓ `రౌడీ అల్లుడు`ని చూసుకుంటున్నారని, ఆ పాత చిరంజీవిని చూసి ఫ్యాన్స్ ఆనందం పడుతున్నారని, వారిని చూస్తుంటే తనకు ఆనందంగా ఉందని చెప్పారు మెగాస్టార్. మరోవైపు నిర్మాతలు, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇక ఇందులో హీరోయిన్ శృతి హాసన్‌కి బర్త్ డే విషెస్ చెప్పారు చిరంజీవి. ఈవెంట్ వేదికగా ఆయన శృతికి బర్త్ డే విషెస్ చెప్పడమే కాదు, అభిమానులందరిచేత పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పించారు మెగాస్టార్. ఇది ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.