శ్రీలంకన్ హాట్ బ్యూటీ జాక్వెలిన్‌ టైం మేనేజ్‌మెంట్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. షూటింగ్ ల సమయంలోనూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా తన షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకుంటుంది ఈ బ్యూటీ. అదే ఫార్ములాను లాక్‌ డౌన్‌ సమయంలోనూ పాటిస్తుంది ఈ బ్యూటీ. ఇళ్లు కదలలేని ఈ పరిస్థితుల్లో కూడా సమయాన్ని ఎంతో ప్రొడక్టివ్‌గా వాడుకుంటూ ఎంతో మంది ఆదర్శంగా నిలుస్తోంది.

ఇటీవల ఓ డిజిటల్ మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లాక్ డౌన్‌ సమయంలోనూ తాను బిజీగా ఉన్నానని చెప్పింది. తన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల గురించి ఆలోచించటం, సల్మాన్‌తో సాంగ్‌ షూట్‌, పలు మ్యాగజైన్‌లకు ఫోటో షూట్‌లు చేయటం లాంటి వాటితో బిజీగా ఉండటంతో నాకు ఎప్పుడు లాక్‌ డౌన్‌లో ఉన్న భావన కలగలేదు అని తెలిపింది.

`నాకు వ్యక్తిగతంగా పాజిటివ్‌గా యాటిట్యూడ్‌తో ఉంటాను. నన్ను నేను ఎప్పుడూ బిజీగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తాను. ఇది అందరికీ కష్టకాలం. తమ నిత్యవసరాల కోసం కూడా బయటకు వెళ్లలేని పరిస్థితి. కానీ ఈ పరిస్థితుల్లో కూడా నేను బిజీగానే ఉన్నాను. అదే సమయంలో త్వరలోనే అన్ని మామూలు స్థితి వస్తాయన్న ఆశాభావంతో ఉన్నాను` అంటూ చెప్పుకొచ్చింది. జాక్వెలిన్‌.Tere Bina': Salman Khan-Jacqueline Fernandez show their lockdown ...

ఈ సమయంలో తను నటించిన మిసెస్ సీరియల్ కిల్లర్ సినిమాకు సంబంధించి డిజిటల్‌ ప్రమోషన్‌లో బిజీగా ఉంది జాక్వెలిన్. ఈ ఏడాది సల్మాన్‌తో పాటు నటించి తేరబినా ఆల్బమ్‌ తో పాాటు మేరు అంగ్నేమే, గెండా పూల్‌ వీడియో ఆల్బమ్స్‌లో కనిపించింది. అంతేకాదు లాక్‌ డౌన్‌ కాలంగా హోం డ్యాన్సర్ పేరుతో ఓ డిజిటల్‌ షోను నిర్వహించింది జాక్వెలిన్‌. ఆషోకు ఆమె వ్యాఖ్యతగా వ్యవహరించింది.