Asianet News TeluguAsianet News Telugu

పవన్‌ పొలిటికల్ స్టాండ్ పై ప్రకాష్ రాజ్ కామెంట్స్ ,వైరల్


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీ వెంట ఉంటే ఆయనకు ఓటు వేయను.. అంటూ ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 

I asked #Pawankalyan why there is a need for him to travel with BJP jsp
Author
First Published Nov 15, 2023, 12:02 PM IST


రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. కానీ రెండూ చాలా సార్లు కలిసి పనిచేస్తాయి మన దేశంలో ..సినిమావాళ్లు రాజకీయాల్లోకి వస్తారు. రాజకీయనాయకులు సినిమాలు నిర్మిస్తూంటారు, పర్యవేక్షిస్తూంటారు. అయితే మిగతా రోజుల్లో వీటికి పెద్దగా ప్రయారిటీ ఉండదు కానీ ఎలక్షన్ టైమ్ వచ్చేసరికి అన్నీ హైలెట్ అవుతూంటాయి. ఇక అసలు విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ మోడీతో కొనసాగితే ఆయనకు ఓటు వేయను.. అని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్నేహితురాలు గౌరీ లంకేష్‌ను హత్య చేయడంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ఆ పూర్వా పరాల్లోకి వెళితే..

పవన్‌కల్యాణ్‌, ప్రకాష్ రాజ్ కలిసి చాలా సినిమాలు చేసారు. పవన్ హీరోగా ప్రకాష్ రాజ్ విలన్ గా కనిపించారు. కెరీర్ ప్రారంభంలో వచ్చిన సుస్వాగతం నుంచి పవన్  తన కొత్త చిత్రం ‘ఓజీ’ (OG)లోనూ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. ఇద్దరూ కలిసి పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా పిచ్చాపాటిగా మాట్లాడుకున్నప్పుడు పొలిటికల్ టాపిక్స్ వస్తూంటాయి. తాజాగా ‘ఓజీ’ (OG) షూటింగ్ లో ఇలాంటి పొలిటికల్ టాపిక్ నిడించిందని ఓ టీవీ ఛానెల్ చర్చా గోష్టిలో  ప్రకాష్ రాజ్ రివీల్ చేసారు.  పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
 
 ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..  ప్రస్తుతం పవన్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో తాను కూడా నటిస్తున్నానని  అప్పుడు సెట్ లో మాట్లాడుకుంటున్నప్పుడు  ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఓటు శాతం ఎంత ఉంది? మోడీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నావని ప‌వ‌న్‌ను ప్రశ్నించినట్లు చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి పలు కారణాలు ఉన్నాయని పవన్ తెలియజేశారన్నారు. దాంతో తను ఇంక ఆ టాపిక్ మాట్లాడలేదని, కానీ పవన్ మాత్రం మీలాంటి వాళ్లు ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా ఉండాలని తనకు పవన్ సూచించినట్లు తెలిపారు. అయితే మాత్రం, పవన్ కళ్యాణ్ మోడీతో కొనసాగితే ఆయనకు ఓటు వేయను.. అని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన స్నేహితురాలు గౌరీ లంకేష్‌ను హత్య చేయడంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. పవన్‌కు ఓటు వేయను.. అంటూ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైర‌ల్‌గా మారాయి. 

 కర్ణాటకలో కొన్నేళ్ల కిందట సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. గౌరీ లంకేష్ ప్రకాష్ రాజ్‌కు స్నేహితురాలు కావడంతో ఆమె హత్యపై ప్రకాష్ రాజ్ అప్పట్లో తీవ్రంగా స్పందించారు. గౌరీ లంకేష్ హత్య తర్వాత బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారని.. ఆమె హత్యలో ఆ పార్టీ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు.  ఈ విషయం గురించి మౌనం వహించారంటూ ప్రధానమంత్రి మోడీపై పలుమార్లు తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత కర్ణాటకలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసి ఓటమి చెందారు.  

ఇక ‘ఓజీ’ (OG)విషయానికి వస్తే...యంగ్ డైరక్టర్  సుజీత్‌ (Sujeeth) దర్శకత్వంలో రూపొందుతోంది ఈ చిత్రం. ఆ మధ్యన ముంబయిలో చిత్రీకరణ సాగుతోంది. ఈ  పవన్‌కల్యాణ్‌తోపాటు,  ప్రియాంక మోహన్‌ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు.  ఈ సినిమా సెట్స్‌ పైనే ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj)కలిసారు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతున్న చిత్రమిది. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios