నిబ్బా, నిబ్బీ లవ్ స్టోరీనే, లోకేష్ కనకరాజ్ ని కాదు: ‘బేబి’ డైరక్టర్
ఇది సినిమాటెక్ యూనివర్శా, లింక్ అయ్యాయా, సీక్వెల్ ఉంటుందా అని అడగొద్దు. నేనేమో లోకేష్ కనకరాజ్ కాదు..అదీ నాకు కూడా తెలుసు.

‘బేబి’ సినిమా సూపర్ హిట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో సాయి రాజేష్ (Sai Rajesh), ఎస్కేఎన్ పేర్లు మారుమోగిపోయిన సంగతి తెలిసిందే. దర్శకుడు సాయి రాజేష్ ని నెక్ట్స్ లెవిల్ గుర్తింపు తెచ్చిందీ చిత్రం. తెలుగు ప్రేక్షకులు మాత్రం ‘బేబి’కి బ్రహ్మరథం పట్టిన ఉత్సాహంతో స్నేహితులు సాయి రాజేష్, ఎస్కేఎన్ కొత్త ప్రాజెక్టులు ఎనౌన్స్ చేసారు. యంగ్ సంతోష్ శోభన్‌తో (Santosh Sobhan) ఒక సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే సాయి రాజేష్ అందిస్తున్నారు. ఎస్కేఎన్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుమన్ పాతూరి దర్శకుడు. ఈ సినిమా ద్వారా అలేఖ్య హారిక (బిగ్ బాస్ హారిక) హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రంగురించి సాయి రాజేష్ మాట్లాడుతూ...ఇది కూడా వన్ మోరీ లవ్ స్టోరీ. సోషల్ మీడియాలో ఎన్ని తీస్తారురా లవ్ స్టోరీలు, అంతా నిబ్బా,నిబ్బీ లవ్ స్టోరీలు. అని చెప్తూ జనాలు బాదకముందే నేనే చెప్తున్నాను. నేను,ఎస్కేన్ కాంబినేషన్ లో మొత్తం ఆరు ప్రేమ కథలు రాబోతాయి. అందులో భాగంగా అందులో రెండు మీరు చూసేసారు కలర్ ఫొటో, బేబి. ఇప్పుడు సంతోష్ శోభన్, హారిక కాంబోలో ఒక సినిమా, వైష్ణవీ ,ఆనందం కాంబినేషన్ లో మరో చిత్రం ఇప్పటికే ఎనౌన్స్ చేసాం అన్నారు. మరో రెండు లవ్ స్టోరీ లు త్వరలో ఎనౌన్స్ చేస్తామన్నారు. ఇది సినిమాటెక్ యూనివర్శా, లింక్ అయ్యాయా, సీక్వెల్ ఉంటుందా అని అడగొద్దు. నేనేమో లోకేష్ కనకరాజ్ కాదు..అదీ నాకు కూడా తెలుసు. ఆరు హార్ట్ హిట్టింగ్ లవ్ స్టోరీలు నేను ,ఎస్కేన్ కలిసి ప్రొడ్యూస్ చేయబోతున్నాము అని చెప్పుకొచ్చారు.
ఇప్పటికే సినిమా ప్రీ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ ప్రీ లుక్ పోస్టర్‌లో హారిక పెదాలపై సంతోష్ శోభన్ ముద్దాడుతున్నారు. ‘కొన్ని ప్రేమకథలు జీవితకాలం వెంటాడుతాయి’ అని పోస్టర్ మీద రాశారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. ప్రస్తుతానికి ప్రొడక్షన్ నెంబర్ 4గానే పిలుస్తున్నారు. సాయి రాజేష్ సొంత నిర్మాణ సంస్థ అమృత ప్రొడక్షన్స్ బ్యానర్‌లో గతంలో ‘హృదయకాలేయం’, ‘కొబ్బరిమట్ట’, ‘కలర్ ఫోటో’ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఇది నాలుగో సినిమా. ఎస్కేఎన్ సొంత నిర్మాణ సంస్థ మాస్ మూవీ మేకర్స్‌తో కలిసి సాయి రాజేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మించిన ‘బేబి’ సినిమాకు దర్శకత్వం వహించిన సాయి రాజేష్.. ఈ సినిమాకు మాత్రం కథ, స్క్రీన్‌ప్లే మాత్రమే అందించి దర్శకత్వ బాధ్యత మరో స్నేహితుడు సుమన్ పాతూరికి అప్పగించారు. సుమన్ గతంలో ‘ఇంకోసారి’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ‘బేబి’ సినిమాకు సంగీతం సమకూర్చిన విజయ్ బుల్గానిన్.. ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ‘బేబి’ చిత్రానికి పనిచేసిన బృందమే ఈ సినిమాకు పనిచేస్తోంది.