వరలక్ష్మి శరత్ కుమార్ భర్త నికొలాయ్ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. నా భార్య వరలక్ష్మికి నేను మొదటి లవర్ కాదంటూ షాక్ ఇచ్చాడు. అది ఎవరో కూడా చెప్పాడు.  

నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం జులై 3న చెన్నైలో ఘనంగా జరిగింది. టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు ఈ పెళ్ళికి హాజరయ్యారు. ముంబై వ్యాపారవేత్త నికొలాయ్ సచ్ దేవ్ తో ఆమె ఏడడుగులు వేశారు. వీరిది ప్రేమ వివాహం. వరలక్ష్మికి నికొలాయ్ చాలా కాలంగా తెలుసట. ప్రేమ మాత్రం కొద్ది రోజుల క్రితం మొదలైందట. ఇరువురు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. నికొలాయ్ కి ఇది రెండో వివాహం. కవిత అనే మహిళను ఆయన మొదటి వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి సంతానం. 

నికొలాయ్ కూతురు టీనేజ్ లో ఉంది. నికొలాయ్ ముంబైలో ఆర్ట్ గ్యాలరీ ఓనర్. ఆయనకు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. నికొలాయ్ ఆస్తుల విలువ రూ. 100 కోట్లు అని ఒక అంచనా. వివాహం అనంతరం నికొలాయ్ మొదటిసారి మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తి రేపాయి. 

మేము ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ... నేను వరలక్ష్మి ఫస్ట్ లవర్ కాదు. ఆమె ఫస్ట్ లవర్ సినిమానే అన్నారు. నన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన తన పేరు మారదని... వరలక్ష్మి శరత్ కుమార్ గానే ఉంటుంది అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. సాధారణంగా భర్త పేరు భార్య పేరుకు తగిలిస్తారు. కానీ నికొలాయ్ భార్య వరలక్ష్మి శరత్ కుమార్ పేరును తన పేరు వెనుక పెట్టుకుంటాడట. 

తనతో పాటు కూతురు పేరు వెనుక వరలక్ష్మి శరత్ కుమార్ అని జోడిస్తానని మీడియా ముఖంగా తన నిర్ణయాన్ని నికొలాయ్ తెలియజేశాడు. తనకు తమిళం రాదన్న నికొలాయ్.. క్షమించాలి అన్నాడు. ఇకపై తన ఊరు ముంబై కాదు చెన్నై అని తెలియజేశాడు. కాగా వరలక్ష్మి గతంలో హీరో విశాల్ ని ప్రేమించారనే టాక్ ఉంది. చాలా ఏళ్ళు రిలేషన్ లో ఉన్న విశాల్-వరలక్ష్మి విడిపోయారు. 

ప్రస్తుతం వరలక్ష్మి బిజీ ఆర్టిస్ట్. తెలుగు, తమిళ భాషల్లో విలక్షణ పాత్రలు చేస్తుంది. వరలక్ష్మి నటించిన క్రాక్, యశోద, వీరసింహారెడ్డి, హనుమాన్ భారీ విజయాలు సాధించాయి. టాలీవుడ్ లేడీ విలన్ గా వరలక్ష్మి స్థిరపడ్డారు. వరలక్ష్మి నటనకు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.