గత కొద్ది రోజులుగా యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే..జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆదికు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడమని బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారని.  అయితే ఎంతవరకూ నిజముంది..బాలయ్యకు అంత అవసరం ఏమొచ్చిందనే విషయం ఎవరికీ అర్దం కాలేదు. 

గత కొద్ది రోజులుగా యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే..జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన హైపర్ ఆదికు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడమని బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారని. అయితే ఎంతవరకూ నిజముంది..బాలయ్యకు అంత అవసరం ఏమొచ్చిందనే విషయం ఎవరికీ అర్దం కాలేదు. తాజాగా ఈ విషయమై హైపర్ ఆది క్లారిటీ ఇఛ్చారు. 

హైపర్ ఆది మాట్లాడుతూ... త‌న‌కు బాల‌కృష్ణ గారి నుంచి వార్నింగ్ రావ‌డం అనేది అబ‌ద్ధ‌మ‌ని తేల్చేసాడు. ఎవ‌రో యూట్యూబ్ ఛానెల్ వాళ్లు కక్కుర్తిగా వ్యూస్ కోసం కావాలని కాంట్రవర్సిగా పెట్టిన హెడ్ లైన్ అని కొట్టి పారేసాడు ఆది. తనను ఇరికించాలని, తనపై బురదజల్లాలని చేసిన ప్రయత్నమే అన్నాడు. 

అయితే అప్ప‌ట్లో తాము బాల‌య్య‌పై ఓ స్కిట్ చేసామని..ఆ టైమ్ లో .. ఎవ‌రో ఓ అభిమాని ఫోన్ చేసి చిన్న వార్నింగ్ ఇచ్చిన మాట వాస్త‌వ‌మే అన్నారు. అలాగే మరో విషయం అని చెప్తూ..ఆ వార్నింగ్ కూడా త‌న‌కు కాద‌ని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఆ విషయం బయిటకు వచ్చిందో..లేక బాలయ్యపై స్కిట్ వేసాం కాబట్టి...ఊహించి అలా రాసేసారో కానీ అటువంటివి ఏమీ జరగలేదన్నారు.

మరో ప్రక్క ఆదిని బాగా ఎంకరేజ్ చేసే నాగబాబు..బాలయ్యపై వరసపెట్టి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఆది సైతం జనసేన ను గుర్తు చేస్తూ మిగతా వాళ్లను వెటకారం చేస్తూండటం గతంలో జరిగిందే. ఇంతకు ముందు కూడా ఆది..కత్తి మహేష్ ని ఉద్దేశించి తన స్కిట్ లో సెటైర్స్ వేసి వివాదం తెచ్చుకున్నాడు.