బుల్లితెర నవ్వుల షో జబర్దస్త్ తో హైపర్ ఆది పాపులర్ అయ్యాడు. ఆది పేల్చే కామెడీ పంచులు విపరీతమైన అభిమానులు ఉన్నారు. హైపర్ ఆది చేసే కామెడీ స్కిట్స్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతుంటాయి. ఆఫ్ ది స్క్రీన్ కూడా ఆది బాగా యాక్టీవ్. జనసేన పార్టీలో ఆది యాక్టీవ్ గా కొనసాగుతున్నాడు. పలు కార్యక్రమాల్లో కూడా ఆది తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటుంటాడు. 

ఇదిలా ఉండగా గత గురువారం ప్రసారమైన జబర్దస్త్ షోలో ఆది కనిపించలేదు. ఆది జబర్దస్త్ కు దూరమవుతాడనే చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. ఆదికి సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. దీనితో ఆది జబర్దస్త్ ని వదిలేశాడా అనే చర్చ జరుగుతోంది. గురువారం జబర్దస్త్ లో ఆది కనిపించకపోవడానికి స్పష్టమైన కారణాలు లభించడం లేదు. 

కొందరు మాత్రం ఆది ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లాడని అందుకే ఈ వారం అతడి స్కిట్ ప్రసారం కాలేదని అంటున్నారు. మరికొందరు మాత్రం ఆది పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టేందుకు జబర్దస్త్ కు దూరమవుతున్నాడనే వాదన కూడా వినిపిస్తోంది. 

ఇందులో ఏది నిజమో తేలాలంటే ఆది స్వయంగా స్పష్టతనిచ్చే వరకు వేచి చూడాలి.