Asianet News TeluguAsianet News Telugu

`హైపర్‌ ఆదిపై దాడి`.. స్పందించిన `జబర్దస్త్` కమెడీయన్‌.. తాను సంపాదించినదాంట్లో కొంత ఇస్తా అంటూ చురకలు

`జబర్దస్త్` కమెడీయన్‌ హైపర్ ఆది స్పందించారు. తనపై మంచు విష్ణు వర్గం దాడి చేశారని సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా దీనిపై హైపర్‌ ఆది స్పందించారు. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చాడు.

hyper aadi couter to attack rumors jabardasth comedian satires
Author
Hyderabad, First Published Nov 10, 2021, 8:09 PM IST

`జబర్దస్త్`(Jabardasth) షోతో పాపులర్‌ అయిన కమెడీయన్‌ హైపర్‌ ఆది(Hyper Aadi). పంచ్‌లకు పెట్టింది పేరుగా, తనదైన పంచ్‌ల వర్షం కురిపిస్తూ బుల్లితెర ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు హైపర్‌ ఆది. ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. Hyper Aadiపై మంచు విష్ణు (Manchu Vishnu)వర్గం దాడి చేసిందంటూ సోషల్‌ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనిపై తాజాగా హైపర్‌ ఆది స్పందించాడు. తనపై వస్తోన్న రూమర్స్ కి ఆయన ఫుల్‌ స్టాప్‌ పెట్టాడు. అంతేకాడు ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. డబ్బులు లేకపోతే.. తాను సంపాదించే వాటిలో కొంత ఇస్తాంటూ వ్యంగంగా స్పందించడం గమనార్హం. ఇన్‌స్టాగ్రామ్‌లో తన వీడియోని షేర్‌ చేశారు హైపర్‌ ఆది. ఇప్పుడిది చక్కర్లు కొడుతుంది. 

ఇందులో హైపర్‌ ఆది స్పందిస్తూ, `గత రెండు రోజులుగా ఓ ఫేక్ న్యూస్‌ తెగ వైరల్‌ అవుతుంది. ఏదో హైపర్‌ ఆది కోసం ఎవరో వెతుకుతున్నారని, దాడి చేయడం కోసం వెతుకుతున్నారని, ఇలా ఏవేవో ఫేక్‌ న్యూసులు వస్తున్నాయి. అరే నాన్నా.. ఈ ఫేక్‌ న్యూసులు రాసే వారందరికీ చెబుతున్నా.. మీ వద్ద డబ్బులు లేకపోతే నాకు చెప్పండి. నేను సంపాదించే దాంట్లో కొంత తీసి మీక్కూడా ఇస్తాను. మేమందరం హ్యాపీగా షూటింగ్‌లు చేసుకుంటున్నాం. అందరం హ్యాపీగా ఉన్నాం. మీరు కూడా హ్యాపీగా ఉండండి` అని చెప్పాడు హైపర్‌ ఆది. ఇప్పుడీ వీడియో సైతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. 

ఇదిలా ఉంటే హైపర్‌ ఆది ఇటీవల దీపావళి సందర్భంగా మంచు విష్ణుని ఇమిటేట్‌ చేస్తూ ఓ స్కిట్ చేశాడు. మీడియాతో మంచు విష్ణు మాట్లాడిన వ్యాఖ్యలను ఈ స్కిట్‌లో యదాథతంగా తనదైన స్టయిల్‌లో ఇమిటేట్‌ చేసాడు హైపర్‌ ఆది. అదే సమయంలో ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ని సైతం వాడుకున్నాడు ఆది. వాటిని జోకులుగా పంచ్‌లు వేశాడు. ఇవి బాగా వైరల్‌ అయ్యింది. దీంతో హైపర్‌ ఆది స్కిట్‌కి హర్ట్ అయిన మంచు విష్ణు వర్గం హైపర్‌ ఆదిపై దాడి చేశారని,ఆయన కోసం వెతుకుతున్నారంటూ సోషల్‌ మీడియాలో పలు పోస్టులు కనిపించాయి. ఇవి వైరల్‌ అయ్యాయి. దీంతో అవి వార్తలుగా మారడంతో తాజాగా హైపర్‌ ఆది స్పందించి వివరణ ఇచ్చాడు. 

ఇక హైపర్‌ ఆది అంటే కామెడీ స్కిట్లకు పెట్టింది పేరు. ఆయన Jabardasth షోలో, మరోవైపు `ఢీ` షోలో సందడి చేస్తుంటాడు. పంచ్ లు, డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో ఎంటర్‌టైన్‌ చేస్తుంటారు. `ఢీ` షోలో దీపికా పిల్లితో కలిసి కెమిస్ట్రీ పండిస్తూ మరో రకంగా ఎంటర్‌టైన్‌ని అందిస్తున్నాడు. ఇలా స్టార్‌ కమెడీయన్‌గా మారిపోయాడు ఆది. జబర్దస్త్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కమెడీయన్‌గానూ నిలిచాడు. సుడిగాలి సుధీర్‌తో ఆది చేసే స్కిట్లకి బుల్లితెరపై మంచి ఆదరణ లభిస్తుండటం విశేషం. మరోవైపు షోస్‌తోపాటు సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు ఆది. 

also read: హైప‌ర్‌ ఆదిపై దాడి జరిగిందా?నిజమెంత?

Follow Us:
Download App:
  • android
  • ios