జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమిపై హైపర్ అది ఊహించని విధంగా కామెంట్ చేశారు. భీమవరం - గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు ఓటమి ఎదురైనా సంగతి తెలిసిందే. ఈ ఓటమిపై అభిమానులు కొందరు బాధతో కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓటమని కామెంట్ చేస్తున్నారు. 

జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సైతం అదే తరహాలో కామెంట్ చేస్తూ షాకిచ్చాడు. మనీ, మద్యం ముందు మానవత్వం ఓడిపోయింది. ఈ రోజు ఓడిపోయింది పవన్ కల్యాణ్ కాదు.. తెలుగు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే’’ అంటూ ఆది చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

హైపర్ ఆది జనసేనకు సంబందించిన ప్రచారాల్లో మీటింగ్ లలో పాల్గొని పవన్ కోసం ప్రచారం కూడా చేశాడు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు నెగిటివ్ కామెంట్స్ కౌంటర్లువేస్తూ వచ్చాడు. గాజువాక - భీమవరం స్థానాల్లో పవన్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఆ స్థానాల్లో వైసిపి అభ్యర్థులు వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి, గ్రంథి శ్రీనివాస్ గెలుపొందారు.