విడుద‌ల‌కు సిద్ధ‌మై, లాక్ డౌన్ వ‌ల్ల ఆగిపోయిన చిత్రాల‌పై ఓటీటీ వేదిక‌లు దృష్టి పెట్టాయి. ఫ్యాన్సీ రేట్లు ఎర‌చూపి సినిమాల్ని కొనేయాల‌ని ఫిక్స‌య్యాయి. కొన్ని చిన్న సినిమాలు మొదట్లోనే ఓటీటీ గ్రిప్పులోకి వెళ్లిపోయాయి. `వి` సినిమాకీ మంచి ఆఫ‌ర్ దొరికింది. అమేజాన్ లో రిలీజ్ చేసేసారు.  టేబుల్ ప్రాఫిట్టుతో సినిమా బ‌య‌ట‌ప‌డింది. అంతవరకూ బాగానే ఉంది. అయితే వి సినిమాకు మొదటి షో నుంచే ప్లాఫ్ టాక్ వచ్చింది. అందుకు కారణం, బలహీనమైన కథ,స్క్రీన్ ప్లే అనేది ప్రక్కన పెడితే...ఈ సినిమా చుట్టూ విపరీతంగా పెంచేసిన హైప్ కారణం అని సినిమా వర్గాలు అంటున్నాయి. 

నాని 25 వ సినిమా కావటం, నాని, ఇంద్రగంటి కాంబినేషన్ లో మూడో సినిమా కావటం హైప్ కు మొదట కారణం. అలాగే సుధీర్ బాబు, నివేదిత, అదితి రావు నటించటం సినిమాపై మరింత అంచనాలు పెంచేసాయి. దిల్ రాజు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, అందుకే ఓటీటిలో ఇవ్వటం ఇష్టపడటం లేదని కథనాలు రావటంతో మరింతగా ఈ సినిమాకు హైప్ తెచ్చాయి. ఈ హైప్ తో సినిమా చూసిన వాళ్లకు అసలు ఎక్కలేదు. సినిమా చాలా డల్ రివ్యూలతో ఓపెన్ అయ్యింది. సెకండాఫ్ ప్లాష్ బ్యాక్, ట్విస్ట్ లు ,డ్రామా లేకపోవటం, క్లైమాక్స్ కూడా బాగోపోవటం సినిమాని మరింతగా దెబ్బ తీసాయి 

  ఇప్పటివరకూ ఇంద్రగంటి నానితో చేసిన రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించి సక్సెస్ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు నానిని మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో ఆవిష్క‌రించే ప్రయత్నం చేసాడు. అలాగే సుధీర్‌బాబుతో `స‌మ్మోహ‌నం` వంటి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించిన ఇంద్ర‌గంటి ఈసారి సుధీర్‌ ను ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ రోల్‌ లో చూపిద్దామనుకున్నారు.  ప్రముఖ నిర్మాత దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా  ఈ సినిమా నిర్మాణమైంది.